అన్వేషించండి
Advertisement
Super Star Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ రికార్డులు - ఇంకెవరూ బీట్ చేయలేరేమో!?
Super Star Krishna Records : సూపర్ స్టార్ కృష్ణ పలు రికార్డులు క్రియేట్ చేశారు. అందులో కొన్ని రికార్డులను ఎవరూ బీట్ చేయలేరని చెబితే అతిశయోక్తి కాదేమో!?
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) ది ప్రత్యేక అధ్యాయం. ఆయన పలు రికార్డులు క్రియేట్ చేశారు. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా చేసింది ఆయనే. ఫస్ట్ కౌబాయ్ సినిమా కూడా ఆయనే చేశారు. సాంఘీక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక సినిమాలు ఎన్నో చేశారు. 350కు పైగా సినిమాలు చేసిన టాలీవుడ్ స్టార్ కృష్ణ. అంతే కాదు... ఇంకెవరికీ సాధ్యం కాని పలు రికార్డులను ఆయన క్రియేట్ చేశారు. అవి ఏమిటో చూడండి.
- ఒకటి, రెండు కాదు... సుమారు 45 సంవత్సరాలు, 1965 నుంచి 2009 వరకూ ఏ సంవత్సరమూ విరామం రాకుండా నటించిన ఏకైక హీరో కృష్ణ.
- సుమారు 350 పైగా సినిమాలలో నటించిన మొదటి కథానాయకుడు కృష్ణ.
- ఒకే నగరంలో ఒకే ఏడాది ఆరు శతదినోత్సవ చిత్రాలు అందుకున్న రికార్డు కృష్ణ పేరిట ఉంది. విజయవాడలో 1983లో ఆయన నటించిన ఆరు సినిమాలు వంద రోజులు ఆడాయి. ఇండియాలో మరే ఇతర హీరోకూ ఇటువంటి రికార్డు లేదు.
- ఒకే ఏడాది ఎక్కువ సినిమాలు విడుదల చేసిన కథానాయకుడిగా కూడా కృష్ణ అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. 1972లో ఆయన నటించిన సినిమాలు 18 విడుదల అయ్యాయి.
- ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన హీరో కూడా కృష్ణే. కెరీర్ మొత్తంలో 50 మల్టీస్టారర్స్ చేశారు.
- ఒకే దర్శకుడితో ఎక్కువ సినిమాలు చేసిన రికార్డు తెలుగులో బహుశా కృష్ణదే అయ్యి ఉండొచ్చు. కె.యస్.ఆర్. దాసు దర్శకతంలో ఆయన 31 సినిమాలు చేశారు.
- హీరోగా కృష్ణ 44 ఏళ్ళ పాటు సినిమాలు చేస్తే... అందులో 30 ఏళ్ళు సంక్రాంతికి ఆయన సినిమాలు విడుదల అయ్యాయి. కృష్ణను సంక్రాంతి కథానాయకుడు అనేవారు.
- కెరీర్ మొత్తంలో వందకు పైగా దర్శకులతో కృష్ణ పని చేశారు. ఆయన 105 మంది దర్శకులతో సినిమాలు చేశారు.
- కృష్ణతో పని చేసిన సంగీత దర్శకుల సంఖ్య ఎంతో తెలుసా? 52!
Also Read : సూపర్ స్టార్ కృష్ణకు తీరని కోరికలు - ఆ నాలుగూ...
- కృష్ణ ఎన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్ చేశారో తెలుసా? పాతిక (25) సినిమాల్లో! ఆయన ట్రిపుల్ రోల్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఏడు సినిమాల్లో కృష్ణ త్రిపాత్రాభినయం చేశారు.
- తమిళంలోకి కృష్ణ నటించిన 20 సినిమాలు డబ్ అయ్యాయి. హిందీలోకి ఆయన సినిమాలు 10 డబ్బింగ్ అయ్యాయి.
- సతీమణి విజయనిర్మల కాంబినేషన్‌లో కృష్ణ 50 సినిమాలు చేశారు. ఆ తర్వాత జయప్రదతో ఎక్కువ సినిమాలు చేశారు. ఆమెతో 43 సినిమాల్లో నటించారు. అతిలోక సుందరి శ్రీదేవితో 31 సినిమాలు చేశారు.
- లాస్ట్, బట్ నాట్ లీస్ట్... తెలుగు ప్రజలకు కృష్ణ అంటే ఎంతో అభిమానం. ఆయన పేరు మీద 2500 అభిమాన సంఘాలు ఉన్నాయి. అదీ కృష్ణ రేంజ్.
Also Read : కృష్ణ ఇక లేరు - ఆయన బాల్యం, ఇండస్ట్రీలోకి రాకముందు జీవితం గురించి తెలుసా?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
తిరుపతి
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion