News
News
X

Writer Padmabhushan OTT: ‘రైటర్ పద్మభూషణ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సుహాస్ ఇటీవలే నటించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. ఈ సినిమా గత నెల 3వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ‘జీ5’ ఓటీటీ సంస్థ ప్రకటించింది.

FOLLOW US: 
Share:

సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే టాలెంట్ నటీనటులకు టాలీవుడ్ లో కొదవేమీ లేదు. సినిమా రంగంలో రానించాలంటే అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పే కొంతమంది మాటలకు సమాధానంగా పలువురు నటీనటులు తమ టాలెంట్ తో తెరపైకి వస్తున్నారు. అలా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న వారిలో హీరో సుహాస్ ఒకరు. ఆర్టిస్ట్ సుహాస్ గా తెరంగేట్రం చేసి అతి కొద్ది కాలంలోనే హీరో సుహాస్ గా పేరు తెచ్చుకున్నారు. సుహాస్ ఇటీవలే నటించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. ఈ సినిమా గత నెల 3 వ తేదీన విడుదల అయి మంచి విజయాన్ని అందుకోడమే కాదు డీసెంట్ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాతో నటుడిగా సుహాస్ మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి. తన నటనతో మరింత మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు సుహాస్. ఇక ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు ఓటీటీ లో చూడాలని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ విడుదల పై అనేక వార్తలు గత కొద్ది రోజులుగా వస్తున్నాయి. అయితే తాజాగా ‘జీ5’ ఓటీటీ సంస్థ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. 

ఇక ఈ సినిమా గత నెల 3 న విడుదల అయి మంచి టాక్ తెచ్చకుంది. విజయవాడ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. రైటర్ కావాలనుకునే ఒక సాధారణ యువకుడి చుట్టూ బెజవాడ బ్యాక్‌డ్రాప్‌ లో తెరకెక్కిన కథ ఇది. మథర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినీ ఇండస్ట్రీకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా చూసి మూవీ టీమ్ ను అభినందించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. హీరో సుహీస్ కూడా మహేష్ బాబు ఫ్యాన్ కావడంతో మహేష్ తన సినిమాను ప్రశంసించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ సినిమాను మహిళల కోసం ప్రత్యేకంగా సెలెక్టెడ్ స్క్రీన్ లలో ఒక్క రోజు ఫ్రీగా స్పెషల్ షోలు వేశారు. ఆ ఒక్కరోజు 30 వేలకు పైగానే మహిళలు ఈ సినిమాను చూశారు. ఇక ఈ మూవీలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్ర మనోహర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రంలో ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ తదితరులు కనిపించారు. ఇక ఈ ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా జీ5 ఓటీటీ వేదికగా మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇక హీరో సుహాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ సినిమా కంటే మందు ఆయన అడవి శేష్ హీరోగా నటించిన ‘హిట్ 2’ సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చారు. నెగిటివ్ రోల్ లో చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రస్తుతం సుహాస్ ‘ఆనంద్ రావ్ అడ్వెంచర్స్’ సినిమాతో పాటు ‘మను చరిత్ర’ అనే సినిమాలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. 

Published at : 08 Mar 2023 03:57 PM (IST) Tags: Writer Padmabhushan Suhas Suhas Movies

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న  నెటిజన్లు