News
News
X

Galodu Movie Trailer: యాక్షన్‌తో దుమ్మురేపిన సుధీర్, ఆకట్టుకుంటున్న ‘గాలోడు’ టీజర్

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘గాలోడు’. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. కామెడీ, యాక్షన్ తో సుధీర్ దుమ్మురేపాడు. ఆడియెన్స్ ను ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది.

FOLLOW US: 
 
తెలుగు బుల్లితెరతో పాటు వెండితెరపై సత్తా చాటుతున్నాడు సుడిగాలి సుధీర్. ఇప్పటికే 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌', '3 మంకీస్‌' లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ‘గాలోడు’ అనే సినిమాలో సుధీర్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ సినిమా నవంబర్ 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘గాలోడు’ ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది.

మాస్ లుక్ లో సుధీర్

మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ ఊర మాస్ లుక్ లో కనిపించాడు. చక్కటి కామెడీతో పాటు బీభత్సమైన యాక్షన్ సీన్లు ఇందులో కనిపిస్తున్నాయి. సుధీర్ నటన, కామెడీ టైమింగ్ అదుర్స్ అనిపిస్తున్నాయి. తొలుత కామెడీగా మొదలైన ట్రైలర్ రాను రాను భారీ యాక్షన్ సీన్లతో ఆకట్టుకుంది. ఓ వైపు గాలోడుగా పిలిపించుకునే సుధీర్, మరోవైపు బడా బడా గూండాలకే భయం పుట్టించడం ఆకట్టుకుంటుంది. అప్పట్లో రెండు సినిమాలు చేసిన సుధీర్.. ఈ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు కనిపిస్తుంది.  ఇప్పటికే విడుదలైన టీజర్ సైతం ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఆయన లుక్, డైలాగ్స్ చూసి, ఈ దెబ్బతో సుధీర్ సుడి తిరగడం ఖాయం అంటున్నారు. మాస్ హీరోగా తనంటూ ఓ సత్తా చాటుకుంటాడని జోస్యం చెప్తున్నారు.  

ఆకట్టుకుంటున్న సాంగ్స్

మరోవైపు 'గాలోడు' సినిమా నుంచి విడుదలైన సాంగ్ కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కించుంది.  'వైఫై నడకలదాన' అనే లిరికల్ సాంగ్ లో సుధీర్ అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు. ‘ఓ పిల్లో హోయిలా హోయిలా' అంటూ సాగే మరో పాట కూడా  యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో పాడారు.  శ్రీ శ్రీరాగ్ లిరిక్స్ అందించారు. ఇక  ఈ సినిమా మీద సుధీర్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ మూవీతో టాలీవుడ్ లో బలంగా నిలదొక్కుకోవాలని భావిస్తున్నాడు. ఈ సినిమాను ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది.

News Reels

జబర్దస్త్ తో పాపులారిటీ

ఇక సుడిగాలి సుధీర్ గురించి పెద్దగా పరిచయం అసవరం లేదు. బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాం ప్రసాద్, గెటప్ శ్రీనుతో కలిసి సుధీర్ చేసిన స్కిట్లు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో వెండితెరపైనా అవకాశాలు దక్కించుకున్నాడు. 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌', '3 మంకీస్‌' లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే, ఈ సినిమాలు ఆయన కెరీర్ కు పెద్దగా మైలేజ్ మాత్రం తీసుకురాలేకపోయాయి. తాజాగా ఆయన  'గాలోడు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో సత్తా చాటుకోవాలని భావిస్తున్నాడు.

Read Also: దక్షిణాది సినిమాలకు జాన్వీ దూరం? తారక్‌తో సినిమాపై క్లారిటీ

Published at : 04 Nov 2022 11:47 AM (IST) Tags: Sudigali Sudheer Galodu Movie Galodu Movie Trailer Release

సంబంధిత కథనాలు

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

Varasudu Song : శింబుకు థాంక్స్ చెప్పిన 'వారసుడు' టీమ్ - థీ దళపతి

Varasudu Song : శింబుకు థాంక్స్ చెప్పిన 'వారసుడు' టీమ్ - థీ దళపతి

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా