News
News
X

Jhanvi Kapoor: దక్షిణాది సినిమాలకు జాన్వీ దూరం? తారక్‌తో సినిమాపై క్లారిటీ

జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఊహాగానాలపై అతిలోక సుందరి కూతురు క్లారిటీ ఇచ్చింది. జూనియర్ తో కలిసి నటించాలని ఉందంటూనే…

FOLLOW US: 

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఓ రేంజిలో విజయాన్ని అందుకున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తాజాగా ఈ సినిమా జపాన్ లోనూ విడుదలై జోరుగా వసూళ్లను చేపడుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న జూనియర్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 30వ చిత్రంలో నటించబోతున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌పై మరోసారి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, కొరటాల ఈసారి ఆ స్థాయి హిట్ ఇస్తారో లేదో అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. 

ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ!

కొరటాల సినిమాలో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి కూతురు, బాలీవుడ్ క్యూట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా సౌత్ సినిమా రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న జాన్వీ, జూ. ఎన్టీఆర్ సినిమాతో ఆ కల నెరవేర్చుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. బాలీవుడ్ లోనూ ఈ వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ మూవీతో టాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతుందనే టాక్ నడిచింది.

ఊహాగానాలకు జాన్వీ క్లారిటీ

తాజాగా టాలీవుడ్ ఎంట్రీపై జాన్వీ కపూర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. తన తాజా సినిమా ‘మిలీ’ ప్రమోషన్ లో భాగంగా జాన్వీ ఇటీవల హైదరాబాద్ కు వచ్చింది. ఈ కార్యక్రమంలో ఆమె తండ్రి బోనీ కపూర్ తో పాటు సహ నటుడు సన్నీ కౌశల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినిమాలో అవకాశంపై స్పందించింది. ఆ వార్తలన్నీ అవాస్తవం అని చెప్పింది. "జూనియర్ ఎన్టీఆర్ సార్‌తో కలిసి పని చేయడానికి ఎవరు ఇష్టపడరు? కానీ ప్రస్తుతానికి, లేదు. నేను దక్షిణాదిలో ఏ చిత్రానికి సైన్ చేయలేదు. సౌత్ సినిమాల్లో నా ఎంట్రీ గురించి చాలా పుకార్లు ఉన్నాయని తెలుసు. నేను కూడా దక్షిణాదిలో పని చేయాలని ఎదురు చూస్తున్నాను. కానీ, ప్రస్తుతానికి సౌత్ లో ఏ సినిమా చేయడం లేదు” అని చెప్పింది. అటు జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై బోనీ కపూర్ కూడా స్పందించారు. జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్ లో బాగా రాణిస్తోందని చెప్పారు. "మిలీ గురించి తప్ప ఇతర విషయాల గురించి మాట్లాడ్డానికి ఇది సరైన వేదిక కాదు. కాబట్టి, ఏ విషయం అయినా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండటమే మంచిది. అలా వేచి ఉండాలని నేను ఆశిస్తున్నా. ప్రస్తుతం జాన్వీ బాలీవుడ్ లో బాగా రాణిస్తోంది” అని చెప్పారు.   

News Reels

ప్రేక్షకుల ముందుకు ‘మిలీ’

ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘మిలీ’ అనే సినిమాలో నటించింది. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘హెలెన్’కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. హెలెన్ మూవీలో హీరోయిన్ గా అన్నా బెన్ నటించింది. ‘మిలీ’ మూవీ ఇవాళ(నవంబర్ 4న) ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also: పవర్ స్టార్‌కు అరుదైన గౌరవం, శాటిలైట్‌కు పునీత్ రాజ్ కుమార్ పేరు

Published at : 04 Nov 2022 10:15 AM (IST) Tags: Jhanvi Kapoor NTR 30 Tollywood debut

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Actress Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై? ప్రజలకు మేలు చేయడానికేనట!

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Liger Money laundering case : విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా ఈడీ వదల్లేదు

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

టాప్ స్టోరీస్

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

England Team Virus Attack: గుర్తుతెలియని వైరస్ బారిన పడ్డ ఇంగ్లండ్ క్రికెటర్లు- పాక్ తో తొలి టెస్ట్ వాయిదా!

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే