X

Sridevi Soda Center: పోస్టర్లు అతికిస్తున్న సుధీర్ బాబు.. ‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ కోసం పాట్లు

హీరో సుధీర్ బాబు ఓ సినిమా హాల్లో పోస్టర్లు అతికిస్తూ కనిపించాడు. తన సినిమా టీజర్ కోసం సరికొత్తగా పబ్లిసిటీ మొదలుపెట్టాడు.

FOLLOW US: 

హీరో సుధీర్ బాబు నటిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధమైపోయింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, విడుదల తేదీ దగ్గరపడుతున్నా.. ట్రైలర్ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు సరికొత్తగా.. తమ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను చెప్పే ప్రయత్నం చేశాడు. 

ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. ఒకప్పుడు ‘ఈ రోజుల్లో..’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆనంది.. తాజాగా ‘జాంబీ రెడ్డి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పైగా, ‘శ్రీదేవి సోడా సెంటర్‌’లో టైటిల్ పాత్ర పోషిస్తోంది. ‘ పలాస 1978’ సినిమాకు దర్శకత్వం వహించిన కరుణ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ‘70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్‌ సినిమాలను అందించిన విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

శ్రీదేవి సోడా సెంటర్‌ ట్రైలర్

సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు యూట్యూబ్‌లో మాంచి రెస్పాన్స్ వస్తోంది. సుధీర్ బాబు ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తున్నాడు. పల్లెటూరి కుర్రాడిలా మాస్ అవతారంలో ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమా కోసం సుధీర్.. హాస్య నటుడు సత్యం రాజేష్‌తో కలిసి సుధీర్ బాబు హైదరాబాద్‌లోని ఓ సినిమా హాల్‌లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా పోస్టర్లు అతికించారు. సుధీర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. 

అయితే, ఈ పోస్టర్ సినిమా రిలీజ్ తేదీ కోసం కాదు. ట్రైలర్ రిలీజ్ తేదీతోపాటు.. అది ఎవరు విడుదల చేయనున్నారో ప్రకటించడం కోసం ఈ పోస్టర్ అతికించారు. ఆగస్టు 19వ తేదీ.. ఉదయం 10 గంటలకు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులు మీదుగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు సుధీర్ బాబు ప్రకటించాడు. ఈ సందర్భంగా సుధీర్.. సత్యం రాజేష్‌తో కలిసి బైకు మీద సినిమా హాల్‌కు వెళ్లడం, పోస్టర్లు అతికించడం బాగుందని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న థియేటర్లలో విడుదల కానుంది.  

వీడియో:

Also Read: జిమ్‌లో మెగాస్టార్‌‌తో ప్రకాష్ రాజ్ ‘చిరు’ మంతనాలు.. ‘మా’లో కాకరేపుతున్న ట్వీట్

Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?

Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!

Tags: Sudheer Babu Sridevi Soda Center Trailer Sridevi Soda Centre release date Sridevi Soda Centre Anandi శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్

సంబంధిత కథనాలు

Karthika Deepam Nirupam : డాక్టర్ బాబుది ఆ సీరియల్ అయిపోయింది, మరి నెక్ట్స్ ఏంటి నిరుపమ్...

Karthika Deepam Nirupam : డాక్టర్ బాబుది ఆ సీరియల్ అయిపోయింది, మరి నెక్ట్స్ ఏంటి నిరుపమ్...

Tollywood: పెళ్లి విషయంలో నవదీప్ పాలసీ ఇదే.. రెహ్మాన్ ప్లేస్ కొట్టేసిన కీరవాణి..

Tollywood: పెళ్లి విషయంలో నవదీప్ పాలసీ ఇదే.. రెహ్మాన్ ప్లేస్ కొట్టేసిన కీరవాణి..

BhamaKalapam: భామాకలాపం టీజర్ చూశారా..? డేంజరస్ హౌస్ వైఫ్.. 

BhamaKalapam: భామాకలాపం టీజర్ చూశారా..? డేంజరస్ హౌస్ వైఫ్.. 

Akhanda: 'అఖండ' సినిమాలో సీన్.. హైదరాబాద్ పోలీసులు ఇలా వాడేశారు..

Akhanda: 'అఖండ' సినిమాలో సీన్.. హైదరాబాద్ పోలీసులు ఇలా వాడేశారు..

Samantha Next Item Song: 'లైగర్' సినిమాలో సమంత ఐటెం సాంగ్.. నిజమెంత..?

Samantha Next Item Song: 'లైగర్' సినిమాలో సమంత ఐటెం సాంగ్.. నిజమెంత..?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Netaji Jayanti 2022: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

Netaji Jayanti 2022: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

PV Sindhu Wins: సయ్యద్ మోదీ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధు... మాళవికా బన్సోద్ పై వరుస సెట్లలో విజయం

PV Sindhu Wins: సయ్యద్ మోదీ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధు... మాళవికా బన్సోద్ పై వరుస సెట్లలో విజయం

NZ PM Update: న్యూజిలాండ్ లో కోవిడ్ ఆంక్షలు... వివాహాన్ని రద్దు చేసుకున్న ప్రధాని జసిండా

NZ PM Update: న్యూజిలాండ్ లో కోవిడ్ ఆంక్షలు... వివాహాన్ని రద్దు చేసుకున్న ప్రధాని జసిండా

Vamika First Appearance: స్టేడియంలో వామిక సందడి.. మొదటిసారి కూతురిని చూపించిన అనుష్క శర్మ!

Vamika First Appearance: స్టేడియంలో వామిక సందడి.. మొదటిసారి కూతురిని చూపించిన అనుష్క శర్మ!