Ante Sundaraniki: 'అంటే సుందరానికీ' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
నాని నటించిన 'అంటే సుందరానికీ' సినిమా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది.
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా 'అంటే సుందరానికి'. జూన్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కొందరికి మాత్రం సినిమా పెద్దగా ఎక్కలేదు. ల్యాగ్ ఉండడం కూడా దీనికి కారణమని చెప్పొచ్చు. ఇటీవల సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన నాని తమ సినిమా ఆవకాయ్ లాంటిదని.. ఆవకాయ్ రుచి రోజురోజుకి ఎలా పెరుగుతుందో, అలా తమ సినిమా కూడా బెటర్ అవుతుందని అన్నారు. కానీ అలా జరగలేదు.
పది రోజుల్లో ఈ సినిమాకి రూ.11 నుంచి రూ.12 కోట్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. దీంతో బ్రేక్ ఈవెన్ కష్టమని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఆసక్తి నెలకొంది. 'అంటే సుందరానికీ' డిజిటల్ రిలీజ్ కి సంబందించిన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను మంచి డీల్ కి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
జూలై మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం డేట్, టైం లాక్ చేసినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. జూలై 8వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Also Read : తలలు కోసి చేతికిస్తా నాయాలా - మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాస్ మామూలుగా లేదుగా
Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు
View this post on Instagram