X

Radhe Shyam: ఎవరీ విక్రమాదిత్య? తెలుసుకోవాలంటే మూడు రోజులు ఆగాల్సిందే

ప్రభాస్ మోస్ట్ ఎవైటింగ్ మూవీ రాధేశ్యామ్ నుంచి తాజా అప్ డేట్ వచ్చింది.

FOLLOW US: 

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది చిత్రయూనిట్. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. అక్టోబర్ 23న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఆ రోజున రాథేశ్యామ్ టీజర్ ను విడుదలచేయబోతున్నట్టు ప్రకటించింది చిత్రయూనిట్. ఆ రోజున 11 గంటల 16 నిమిషాలకు రాధేశ్యామ్ టీజర్ రాబోతోందని చెప్పారు నిర్మాతలు. ఆ రోజునే ‘విక్రమాదిత్య’ ఎవరో రివీల్ చేయబోతున్నారు. 

ఈ సినిమా మొత్తం ఇటలీ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్ స్టోరీ అని తెలిసిందే. ఇందులో ప్రభాస్ పాత్ర పేరు విక్రమాదిత్య కాగా, పూజా హెగ్డే  ప్రేరణగా నటిస్తోంది. అలాగే అలనాటి నటుడు కృష్ణంరాజు ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారట. ఈ సినిమాపై ప్రభాష్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. బాహుబలి రేంజ్ లో హిట్ కొట్టడం ఖాయమని భావిస్తున్నారు. 

బాహుబలిలో వీరుడిగా, సాహోలో యాక్షన్ హీరోగా కనిపించిన ప్రభాస్, రాధేశ్యామ్ లో మాత్రం ప్రేమికుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమై పోతుంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కడప జిల్లాల్లోని గండికోటలో కూడా చిత్రీకరించారు. బాహుబలిలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ ఈ చిత్రంలోనూ కనిపించనున్నారు. ఇందులో ఈయనది కాషాయ వస్త్రాలు ధరించిన గురువు పాత్రగా గతంలోని విడుదలైన కొన్ని ఫోటోల ద్వారా తెలుస్తోంది.

">

Also read: అంగరంగవైభవంగా ఈజిప్టు ప్రియుడిని పెళ్లాడిన బిల్ గేట్స్ కూతురు

Also read: గంటలు గంటలు కూర్చుని నిద్రపోవడం.. ప్రాణానికే ప్రమాదమా?

Also read: మగవారికి గట్టి షాకిచ్చిన జైపూర్ రెస్టారెంట్... ఇప్పుడు ఎలా తింటారో చూద్దాం

Tags: Prabhas Pooja hegde RadheShyam teaser రాధేశ్యామ్

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: 'నీ గురించి ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేవీ గుర్తులేవు' సిరిపై షణ్ముఖ్ ఫైర్..

Bigg Boss 5 Telugu: 'నీ గురించి ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేవీ గుర్తులేవు' సిరిపై షణ్ముఖ్ ఫైర్..

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

Bipin Rawat Demise: మీరు లేని లోటు పూడ్చలేనిది.. బిపిన్ రావత్‌కు సెలబ్రిటీల నివాళులు!

Bipin Rawat Demise: మీరు లేని లోటు పూడ్చలేనిది.. బిపిన్ రావత్‌కు సెలబ్రిటీల నివాళులు!

Vijay Devarakonda: మహేష్ బాబు బ్రాండ్ కొట్టేసిన రౌడీ హీరో..

Vijay Devarakonda: మహేష్ బాబు బ్రాండ్ కొట్టేసిన రౌడీ హీరో..

Pushpa: 'ఉ.. అంటావా.. ఊఊ అంటావా..' సమంత స్పెషల్ సాంగ్ వచ్చేస్తుందోచ్..

Pushpa: 'ఉ.. అంటావా.. ఊఊ అంటావా..' సమంత స్పెషల్ సాంగ్ వచ్చేస్తుందోచ్..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

Saiteja Helicopter Crash : త్రివిధ దళాల అధిపతికే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

Saiteja Helicopter Crash :  త్రివిధ దళాల అధిపతికే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..!  కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

Mi 17V Helicopter : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?

Mi 17V Helicopter :  వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?