By: ABP Desam | Updated at : 10 Apr 2022 04:47 PM (IST)
'ఆర్ఆర్ఆర్' క్రేజ్ - 1000 కోట్ల క్లబ్ లో రాజమౌళి సినిమా
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజే ఈ సినిమా రెండొందల కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది.
నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. అక్కడ కూడా ఈ సినిమా వందల కోట్ల వసూళ్లు రాబడుతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క నైజాంలోనే వంద కోట్లు రాబట్టింది ఈ సినిమా. సినిమాలో ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉండడం, ఎన్టీఆర్-రామ్ చరణ్ లను ఒకే తెరపై చూసే ఛాన్స్ రావడంతో ఎవరూ సినిమాను మిస్ అవ్వడం లేదు. రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఎక్కువ అవుతున్నారు.
టికెట్ రేట్ ఎంతున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు రేట్లు తగ్గడంతో మళ్లీ థియేటర్ కి క్యూ కడుతున్నారు. తాజాగా ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది. సినిమా విడుదలైన 16 రోజుల్లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. చిత్రబృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. వెయ్యి కోట్లు అనేది ఒక ఇండియన్ సినిమాకి డ్రీమ్ అని.. మీకోసం బెస్ట్ సినిమా రూపొందించామని.. దీనికి బదులుగా సినిమాపై ఎనలేని ప్రేమ చూపించారని పోస్ట్ లో రాసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు.. అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 16 రోజుల్లోనే రూ.551.51 కోట్ల షేర్, రూ.1003 కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. విడుదలకు ముందు ఈ సినిమాకి దాదాపు రూ.450 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పటివరకు దాదాపు వంద కోట్ల లాభాలు అందుకున్నారు నిర్మాతలు.
Also Read: ఆ బూతులేంటి? నటరాజ్ మాస్టర్ పై నాగార్జున ఫైర్
Also Read: రవితేజ కోసం సిద్ శ్రీరామ్ మ్యాజికల్ సాంగ్
Meena Husband Died: బ్రేకింగ్ న్యూస్ - హీరోయిన్ మీనా భర్త మృతి
Ranga Ranga Vaibhavanga: ఆర్జే కాజల్, మెహబూబ్‌తో జతకట్టిన వైష్ణవ్ తేజ్, కేతిక - కొత్తగా లేదేంటో!
Manasanamaha: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మన తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమః'!
Samrat Reddy: తండ్రి కాబోతున్న ‘బిగ్ బాస్’ సామ్రాట్
Urfi Javed: వీడియో - అయ్యో, పువ్వు అనుకుని ఫోన్ పడేసిందే, పిచ్చి ముదిరితే ఇంతే!
Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు
Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..
IND vs IRE, 1st Innings Highlights: దీపక్ హుడా, సంజూ శాంసన్ సూపర్ షో- ఐర్లాండ్‌కు భారీ టార్గెట్
IPS AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు