Bigg Boss OTT Telugu: ఆ బూతులేంటి? నటరాజ్ మాస్టర్ పై నాగార్జున ఫైర్
హౌస్ మేట్స్ ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తూ.. మిమ్మల్ని మోసం చేస్తుంది ఎవరో చెప్పండని అడిగారు నాగార్జున.
బిగ్ బాస్ సీజన్ ఐదు వారాలను పూర్తి చేసుకొని ఆరోవారంలోకి ఎంటర్ అవుతుంది. ఈ వారం హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్లనున్నారు. ఈరోజు ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యేదెవరో తెలియనుంది. సాధారణంగా నాగార్జున వీకెండ్ వచ్చి హౌస్ మేట్స్ చేసిన తప్పొప్పుల గురించి నిలదీసి వారిని ఎంటర్టైన్ చేసి వెళ్లిపోతారు. అయితే ఈసారి మాత్రం నాగార్జున చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో ఈ విషయం క్లియర్ గా తెలుస్తోంది.
ముందుగా హౌస్ మేట్స్ ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తూ.. మిమ్మల్ని మోసం చేస్తుంది ఎవరో చెప్పండని అడిగారు. అందులో ఒక్కొక్కరూ ఒక్కోలా సమాధానం చెప్పారు. మోసం చేసేంత చనువు ఎవరికీ ఇవ్వలేదని మహేష్.. ఈ హౌస్ లో ఎవరినీ నమ్మడం లేదని హమీదా చెప్పుకొచ్చారు. నటరాజ్ మాస్టర్.. యాంకర్ శివ మోసం చేస్తున్నట్లు అనిపిస్తుందని అన్నారు. చివరికి బిందుని మోసం చేసినా.. ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు.
ఇక స్రవంతి.. తను బెస్ట్ ఫ్రెండ్స్ గా భావించిన అఖిల్, అజయ్ మోసం చేశారని తెలిపింది. శివ.. నటరాజ్ మాస్టర్ తనను మోసం చేస్తున్నారని చెప్పాడు. ఆ తరువాత నటరాజ్ మాస్టర్‌కు లుంగీ ఎత్తి చూపించడం కరెక్ట్ అనుకుంటున్నావా? అని నాగార్జున ప్రశ్నించారు. సరదాగా చేశానని శివ చెప్పగా.. బిగ్‌బాస్ వీడియో ప్లీజ్ అంటూ శివ ఏం చేశాడో చూపించారు. అలానే నటరాజ్ మాస్టర్ బూతులు మాట్లాడడాన్ని నాగార్జున ఎత్తిచూపారు.
23 ఏళ్ల అనుభవం ఉంది.. ఆ పదాలేంటి..? అని ప్రశ్నించారు నాగార్జున. లుంగీ ఎత్తడం తప్పు అని నాగార్జున.. శివను హెచ్చరిస్తుండగా.. నటరాజ్ మాస్టర్ మధ్యలో కలగజేసుకోవడంతో నాగార్జునకు కోపమొచ్చింది. 'నటరాజ్ మాస్టర్ సైలెంట్.. నేను అతడితో మాట్లాడుతున్నాను' అంటూ గట్టిగా అరిచారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
Also Read: వీరమల్లు షూటింగ్‌కు ముందు పవన్ కల్యాణ్ శ్రీరామ నవమి పూజ
Also Read: విజయ్ 66లో పూజా హెగ్డే బదులు రష్మికను తీసుకోవడం కారణం ఏంటంటే?
"Natraj Master, SILENT! I'M TALKING TO HIM!" 😡💢
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 10, 2022
Sunday Funday starts off with tensions rising! What will be tonight's outcome? Don't forget to tune in at 6PM, exclusively on @DisneyPlusHS #BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND @iamnagarjuna pic.twitter.com/0EwOjl6fp7
"Shiva. Shut up! Chesindhi thappu..."@iamnagarjuna has a few strong words for Shiva! What did he do? Watch the show at 6PM to find out! Exclusively on @DisneyPlusHS #BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND pic.twitter.com/otjXVGRTzV
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 10, 2022