News
News
X

RRR In Oscar: 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ ప్రయాణంలో అసలైన బాహుబలి ఇతనే..!

ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేలా కృషి చేసిన వ్యక్తి రాజమౌళి తనయుడు కార్తికేయ.

FOLLOW US: 
Share:

RRR ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు. SS రాజమౌళి విజన్ ఎలా ఉంటుందో యావత్ ప్రపంచం మాట్లాడుకునేలా చేసిన సినిమా. నందమూరి తారకరామారావు, రామ్ చరణ్ లాంటి రెండు విభిన్న ధృవాలు కలిగిన హీరోలను కలిపి రాజమౌళి సృష్టించిన ఈ అద్భుతం ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో తెలుగు సినిమా జెండాను రెపరెపలాడిస్తోంది. ప్రశంసలు ఎన్ని వచ్చాయో అంతకు మించి అవార్డుల రేసులోనూ దూసుకెళ్తోంది. "నాటు నాటు" లాంటి పాటతో గోల్డెన్ గ్లోబ్ అందుకుని ఆ ఘనత సాధించిన ఆసియా ఖండపు తొలి చిత్రంగా RRR నిలిచింది. ఇటు ఆస్కార్ బరిలోనూ భారీ చిత్రాలకు, పాప్ సంగీత సంచలనాలకు సవాల్ విసురుతోంది. అసలు ఆస్కార్ బరిలో RRR ఇంత బలంగా నిలబడటానికి వెనుక రాజమౌళి ముద్ర ఎంత స్ట్రాంగ్ రీజనో....అంతకుమించి ఈ సినిమా కోసం కష్టపడుతున్న మరో మాస్టర్ మైండే SS కార్తికేయ.

Also Read: పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' టీజర్ వచ్చేస్తుందోచ్ - ఎప్పుడంటే?

రాజమౌళి తనయుడిగా...తండ్రితో పాటు సినిమా కోసం కష్టపడే ఓ టెక్నీషియన్ గానే బయటి ప్రపంచానికి తెలిసిన కార్తికేయ లోని ఓ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ కు RRR ఓ బెంచ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. బాహుబలి సినిమాలతో వరల్డ్ వైడ్ వచ్చిన అప్లాజ్ ను దృష్టిలో పెట్టుకుని RRR ను చాలా జాగ్రత్తగా చిత్ర బృందం ప్లాన్ చేసింది. సినిమాలో పాత్రలకు తగినట్లుగా విదేశీనటులను యాక్ట్ చేయించడం దగ్గర నుంచి.. ప్యాన్ ఇండియన్ లెవల్ లో ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్ కు చేరువయ్యేలా సినిమాకు చేసిన ప్రమోషన్స్ లో ప్రతీ చోట కార్తికేయ మార్క్ ఉంది. ఓ టీమ్ లీడర్ గా సినిమా పరిస్థితులను అర్థం చేసుకుంటూ తను నడిపించిన విధానమే ఈ రోజు RRR ను మార్కెట్ లో మంచి పొజిషన్ లో నిలబెట్టింది. ఓ సూపర్ బ్రాండ్ గా మార్చేసింది. 

ప్యాన్ ఇండియా లెవల్లో సూపర్ సక్సెస్ తర్వాత RRR ను గ్లోబల్ మార్కెట్ లో మరింత ముందుకు తీసుకెళ్లేలా రాజమౌళి ప్లాన్ చేశారు. ఆ బాధ్యతలను కొడుకు కార్తికేయకు అప్పగించారు. ముందుగా RRR టీమ్ తమ డిస్ట్రిబ్యూటర్ విషయంలోనే చాలా తెలివిగా వ్యవహరించింది. Varience ఫిల్మ్స్ అనే న్యూయార్క్ బేస్డ్ కంపెనీకి అమెరికాలో డిస్ట్రిబ్యూషన్స్ బాధ్యతలు అప్పగించారు. స్ట్రైట్ రిలీజ్ అయిపోయిన తర్వాత వేరియన్స్ ఫిలింస్ కొన్ని స్పెసిఫిక్ థియేటర్లలో RRR ను రీ రిలీజ్ చేసింది. ఫలితంగా RRR గురించి మాట్లాడుకోవటం మొదలైంది. ఈ లోగా నెట్ ఫ్లిక్స్ లో కూడా సూపర్ హిట్ కావటంతో RRR కు టాక్ పెరిగింది. సినిమాను నేరుగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్స్ కు పంపిస్తుందని భావించారు. అంతకు ముందే RRR కు ఉన్న టాక్ ను అందరికే తెలిసేలా #RRRForOScars అనే హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్  మొదలుపెట్టారు.

Also Read : రష్మీ ఇంట్లో విషాదం - కన్నీటితో కడసారి వీడ్కోలు

భారత్ తరపున అధికారికంగా "ఛల్లో షో" కు మార్కెట్ లభించటంతో...కార్తికేయ టీమ్ తమ స్ట్రాటజీను ఛేంజ్ చేసింది. సినిమాకు ఉన్న బజ్ ను జనాల్లోకి తీసుకెళ్తూ వేరియన్స్ ఫిలిమ్స్ ద్వారా ఆస్కార్ అప్రూవ్డ్ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయించారు. అప్పటికే వెస్ట్రన్ కంట్రీస్ లో RRR కు వచ్చిన క్రేజ్ తో ఫర్ యువర్ కన్సిడరేషన్ కింద జనరల్ క్యాటగిరీలో ఆస్కార్స్ కు RRR ను సబ్మిట్ చేశారు. TCL లాంటి థియేటర్లలో సినిమాను ప్రదర్శించటం, దానికి ప్రేక్షకుల నుంచి భారీస్పందన రావటం మొదలైంది. ఈలోగా వెరైటీ మ్యాగజైన్ లాంటి ఆస్కార్ ప్రెడిక్షన్ మ్యాగజైన్స్ ద్వారా RRR ను మరింత పుష్ చేశారు. తారక్ లాంటి హీరోనూ ఆస్కార్ బరిలో నిలబడగల సత్తా ఉన్న నటుడిగా వచ్చిన ఆర్టికల్స్ తో ఇంటర్నేషనల్ మీడియా దృష్టి RRR పైన పడింది. లాస్ ఏంజెల్ టైమ్స్ లో తమ క్యాలెండర్ పేజ్ లో RRR ఫోటోలను ప్రచురించటం పెద్ద టర్నింగ్ పాయింట్. వెస్ట్రన్ ఆడియెన్స్ తో పాటు క్రిటిక్స్ కూడా RRR గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక అవార్డుల టైం దగ్గర పడుతున్న కొద్దీ చిత్ర బృందం మరింత హైప్ ఇచ్చేందుకు నేరుగా రంగంలోకి దిగింది. 

ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి అమెరికాలోని థియేటర్లకు తిరుగుతూ ప్రేక్షకులను పలకరించారు. అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వటంతో మరింత రీచ్ వచ్చింది. ఈలోగా జపాన్ మార్కెట్ లోనూ RRR క్లిక్ అవ్వటం కార్తికేయ అండ్ టీమ్ కు బోనస్ పాయింట్. ఫలితంగా పదుల సంఖ్యలో ఇంటర్నేషనల్ అవార్డులకు RRR నామినేట్ అవటం..గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రఖ్యాత అవార్డులు RRR ను చేరుకోవటం జరిగాయి.  మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో RRR హీరోలు యాక్ట్ చేస్తారా లేదా అక్కడి ప్రజలు చర్చింకునే స్థాయికి ఇప్పుడు RRR బ్రాండ్ వెళ్లటం వెనుక కార్తికేయనే కర్త.. కర్మ.. క్రియ.

Published at : 21 Jan 2023 10:36 AM (IST) Tags: RRR SS Rajamouli Ram Charan NTR Oscar Award SS Karthikeya RRR In Oscar

సంబంధిత కథనాలు

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

టాప్ స్టోరీస్

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో  'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!