అన్వేషించండి

HHVM Teaser : పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' టీజర్ వచ్చేస్తుందోచ్ - ఎప్పుడంటే?

Hari Hara Veera Mallu Teaser : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రక సినిమా 'హరి హర వీర మల్లు' టీజర్ త్వరలో విడుదల కానుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీర మల్లు' (Hari Hara Veera Mallu). త్వరలో ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

జనవరి 26న వీరమల్లు టీజర్
Hari Hara Veera Mallu Teaser : రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న 'హరి హర వీరమల్లు' టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత ఏయం రత్నం తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 31న 'ఖుషి' రీ రిలీజ్ చేసినప్పుడు... దాంతో పాటు టీజర్ విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, విడుదల కాలేదనుకోండి. ఇప్పుడు టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ 2న 'హరి హర వీరమల్లు' వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్ తొడ కొట్టిన విజువల్ వైరల్ అయ్యింది. 

Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే? 

'హరి హర వీరమల్లు'కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రతినాయకుడిగా ఔరంగజేబు పాత్రలో హిందీ హీరో బాబీ డియోల్ (Bobby Deol) నటిస్తున్నారు. 

తెలుగులో బాబీకి తొలి చిత్రమిది
'హరి హర వీర మల్లు' పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. అయితే, బాబీ డియోల్‌కు తొలి తెలుగు చిత్రమిది. ఇంతకు ముందు ఆయన చేసిన కొన్ని హిందీ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యాయి. వెబ్ సిరీస్ కూడా! ఇప్పుడు పవన్ సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.    

వేసవిలో విడుదల
ఇటీవల సినిమాలో మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆ షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఇప్పుడు బాబీ డియోల్ షెడ్యూల్ కోసం సిటీలోని ప్రముఖ స్టూడియోలో సెట్ వేశారు. ఆయనకు వెల్కమ్ చెబుతూ కారు దిగిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''ఇండియన్ సినిమాలో బిగ్ యాక్షన్ స్టార్ అయిన బాబీ డియోల్‌తో పని చేస్తుండటం సంతోషంగా, ఎగ్జైటెడ్ గా ఉంది'' అని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్వీట్ చేశారు. ఈ ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.  

Also Read : రష్మీ ఇంట్లో విషాదం - కన్నీటితో కడసారి వీడ్కోలు
  
ఈ సినిమాలో నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు అమ్మాయి పూజితా పొన్నాడ కూడా ఓ రోల్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.

'హరి హర వీర మల్లు' సెట్స్ మీద ఉండగా... హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ స్టార్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారట. కొన్ని రోజుల క్రితం పూజతో ఆ సినిమా ప్రారంభమైంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్టు టాక్. డీవీవీ దానయ్య నిర్మాతగా సుజీత్ దర్శకత్వంలో మరో సినిమాకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సముద్రఖని దర్శకత్వంలో 'వినోదయ సీతం' రీమేక్ కూడా ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
ఓట్ల పండగలో మరో ఎపిసోడ్‌ - తొలి విడత పోలింగ్ షురూ
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Embed widget