అన్వేషించండి
Advertisement
South Sequels : సీక్వెల్ ఆశ పెట్టి హ్యాండిచ్చేశారే..!
గతంలో కొన్ని సినిమాలకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించి.. వాటిని గాలికి వదిలేశారు.
గతంలో కొన్ని హిట్ సినిమాలకు సీక్వెల్స్ ను తెరకెక్కించారు. కానీ వీటిలో ఏదీ పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో టాలీవుడ్ లో సీక్వెల్స్ వర్కవుట్ అవ్వడం లేదని వార్తలు వినిపించాయి. అయినప్పటికీ ఈ సెంటిమెంట్ ను పక్కన పెట్టి కొందరు దర్శకులు ముందడుగు వేశారు. ఈ క్రమంలో 'బంగార్రాజు', 'ఎఫ్ 3', 'కార్తికేయ 2', 'చిత్రం 1.1' వంటి సీక్వెల్స్ రూపొందుతున్నాయి. అయితే గతంలో కొన్ని సినిమాలకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించి.. వాటిని గాలికి వదిలేశారు. అలా ఆగిపోయిన సీక్వెల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
బిజినెస్ మెన్ :
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో మహేష్ క్యారెక్టరైజేషన్ అభిమానులను ఆకట్టుకుంటుంది. మహేష్ కెరీర్ లో ఇలాంటి సినిమా మరొకటి రాదేమో అని చెబుతుంటారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని రిలీజ్ టైమ్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. కానీ ఇప్పటివరకు దాని ఊసే లేదు.
కిక్ :
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి సీక్వెల్ గా 'కిక్ 2' సీక్వెల్ వచ్చింది. దాని ఎండింగ్ టైటిల్స్ లో 'కిక్ 3' ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ దాని గురించి దర్శకనిర్మాతలు ఎలాంటి స్టెప్ తీసుకోలేదు.
గబ్బర్ సింగ్ :
'గబ్బర్ సింగ్'కు సీక్వెల్ గా 'సర్ధార్ గబ్బర్ సింగ్' వచ్చింది. ఆ సినిమా ఎండింగ్ టైటిల్స్ లో 'రాజా సర్ధార్ గబ్బర్ సింగ్' ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
రాజా ది గ్రేట్ :
రవితేజ-అనీల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. మొన్నామధ్య సీక్వెల్ మొదలవుతుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు అసలు ఎలాంటి అప్డేట్ లేదు.
కబాలి :
రజినీకాంత్ నటించిన 'కబాలి' సినిమా తెలుగునాట పెద్దగా వర్కవుట్ అవ్వనప్పటికీ తమిళంలో మాత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పుడు దర్శకుడు పట్టించుకోవడం లేదు.
తుపాకీ :
విజయ్ - మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు సీక్వెల్ కష్టమని అంటున్నారు.
విక్రమార్కుడు :
రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో భారీ విజయాన్ని అందుకున్న సినిమా ఇది. తనకు ఇష్టమైన సినిమా అంటూ రాజమౌళి గతంలో చెప్పారు. దానికి సీక్వెల్ తీయాలని ఉందని కూడా అన్నారు. కానీ ఆ దిశగా అడుగులు పడడం లేదు.
అదుర్స్ :
'రభస', 'టెంపర్' ఆడియో వేడుకల్లో ఎన్టీఆర్ తో 'అదుర్స్ 2' ఉంటుందని.. వక్కంతం వంశీ కథ రెడీ చేయాలని వినాయక్ అన్నారు. కానీ తరువాత దానికి గురించి పట్టించుకున్నవారే లేరు. ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
క్రైమ్
నిజామాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion