అన్వేషించండి
Advertisement
Sonali Bendre: కేవలం డబ్బు కోసమే ఆ సినిమాలు చేశా - సోనాలి బింద్రే వ్యాఖ్యలు
క్యాన్సర్ కారణంగా సినిమాలకు దూరమైన సోనాలి.. ఇప్పుడు కోలుకోవడంతో తిరిగి నటించడం మొదలుపెట్టింది.
ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది సోనాలి బింద్రే. మెగాస్టార్ చిరంజీకి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు ఇలా స్టార్ హీరోలతో ఆడిపాడింది. అయితే కెరీర్ ఆరంభంలో మాత్రం ఆమె కొన్ని ఫ్లాప్ సినిమాల్లో నటించింది. మరికొన్ని సినిమాలు చూస్తే అసలు ఆమె ఎలా ఒప్పుకుందనే సందేహాలు కలుగుతాయి. తాజాగా ఈ విషయాలపై స్పందించింది సోనాలి.
క్యాన్సర్ కారణంగా సినిమాలకు దూరమైన సోనాలి.. ఇప్పుడు కోలుకోవడంతో తిరిగి నటించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆమె నటించిన 'ది బ్రోకెన్ న్యూస్' వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 10 నుంచి జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటుంది సోనాలి. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.
కెరీర్ ఆరంభంలో తనకు డబ్బు అవసరం చాలా ఉండేదని.. ఇంటికి రెంట్ కట్టుకోవాలి, బిల్స్ పే చేసుకోవడం కోసం కొన్ని సినిమాల్లో నటించేదాన్ని అని తెలిపింది. నటిస్తున్నంతసేపు ఈ సినిమా ఎందుకు చేస్తున్నానా..? అనిపించేదని కానీ చెక్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోయేదాన్ని అని తెలిపింది. తను నటించిన కొన్ని సినిమాలు అసలు చూడలేమని చెప్పుకొచ్చింది.
ఫ్యామిలీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడేదని.. కేవలం డబ్బు కోసమే సినిమాలు చేసేదాన్ని అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇండస్ట్రీలో తనకు గాడ్ ఫాదర్ అనేవారు లేరని.. ఆ అవసరం కూడా తనకు రాలేదని తెలిపింది. తెలుగు, తమిళ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసింది సోనాలి. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. త్వరలోనే ఈమె తెలుగులో రీఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion