News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

వెంటాడే ప్రేమ కావ్యం ‘సీతారామం’ - రివ్యూ కాదిది ప్రేక్షకుడి వ్యూ!

తెలుగు తెర మరిచి పోయిన రొమాన్స్ ను మళ్ళీ గుర్తుచేసిన సినిమా..

సీతారామం కాదు ఇది సీతాయణం..

మనసుని తాకే ప్రేమకథ.. 

థియేటర్ లో చూడాల్సిన క్లాసిక్ లవ్ స్టోరీ..

రివ్యూ కాదిది .. మామూలు ప్రేక్షకుడి వ్యూ.

FOLLOW US: 
Share:

రిగ్గా గుర్తు లేదుకానీ.. సరైన ప్రేమకథ తెరమీదకు వచ్చి చాలా ఏళ్లయ్యింది. రొమాన్స్ అన్న మాటకు ఎప్పుడో అర్ధం మార్చేశాం. ఫోన్లు వచ్చి ఉత్తరాలను చంపేశాయి. ఇంటర్నెట్ వచ్చి పుస్తకాలను మింగేసాయి. అలాగే రొమాన్స్ పేరుతో లిప్ లాక్ లకు అలవాటు పడ్డాక మనసును తాకే హృద్యమైన సినిమాలను మిస్వవ్వడం మొదలైంది. ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా నడుస్తోంది.

బాలీవుడ్ అంటే కేవలం ముంబై సిటీ కల్చర్ మాత్రమే అనుకుంటూ హిందీ.. విభిన్నతకు పెద్దపీట వేస్తూ మలయాళం.. యాక్షన్ మోజులో కన్నడ.. స్టార్ సినిమాలు తప్పితే, మరీ నేచురల్ గా ఉండే సినిమాల ట్రెండ్ లో తమిళ సినిమా.. గత కొన్నేళ్లుగా అక్కడికక్కడే తిరుగుతున్నాయి. తెలుగు సినిమా మాత్రం ఈ మధ్య మళ్ళీ ప్రేమకథలకు కొద్దో గొప్పో ఆలంబనగా నిలుస్తున్నాయి. ఇక్కడా భారీ సినిమాలు.. క్రేజీ కాంబినేషన్ల పిచ్చి లేకపోలేదు. అయినప్పటికీ అప్పుడప్పుడూ అయినా మనసును తాకే ప్రేమకథలు.. మేము ఉన్నామంటూ మనల్ని పలకరిస్తూనే ఉన్నాయి.

ఒక పక్క ‘పుష్ప’, ‘RRR’, ‘బాహుబలి’ లాంటి భారీ సినిమాలను  అందిస్తూనే.. మరోవైపు చక్కటి ప్రేమకథలను కూడా తెరపై చూపిస్తోంది టాలీవుడ్. ఈ మధ్య కాలంలో విడుదలైన ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింఘ రాయ్’, ‘అంటే సుందరానికి’ లాంటి సినిమాలు దీనిని ప్రూవ్ చేశాయి. అయితే, వాటిని తలదన్నే ప్రేమ కథ చిత్రం ‘సీతారామం’. ఎన్నో సినిమాలు తీసి, తెలుగువారే సొంత ఆస్తిగా భావించే వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందిన సినిమా ఇది. మలయాళ హీరో.. మరాఠీ హీరోయిన్.. తమిళ మ్యూజిక్ డైరెక్టర్.. తెలుగు డైరెక్టర్‌లను కలుపుతూ సీనియర్ నిర్మాత అశ్వనీ దత్.. ఆయన కుటుంబం కలిసి నిర్మించిన అసలు సిసలైన పాన్ ఇండియా సినిమా ‘సీతారామం’. 

ఈ తరానికీ ఒక క్లాసిక్ ప్రేమకథ ‘సీతారామం‘

‘లవ్ స్టోరీ’ అంటే పరమ బోర్, లేదా రొమాన్స్ అంటే శృంగారమే అనే భావనలో ఉన్న నేటితరం ప్రేక్షకులకి ఒక చక్కటి ప్రణయ కావ్యం లాంటి చిత్రం ఇది. మీకు ఆస్వాదించే మనసుంటే.. మిమ్మల్ని కట్టిపడేసే ప్రేమకథను అందించే దమ్ము నాకుంది అంటూ దర్శకుడు హను రాఘవపూడి ప్రేక్షకులకు రాసిన లేఖ ‘సీతారామం’. ఈ సినిమా వీకెండ్ లో ఎంజాయ్ చేసి తెల్లారగానే మర్చిపోయే నైట్ పార్టీ లాంటిది మాత్రం కాదు. ఎప్పుడైనా సెలవులకు మన ఊరు  వెళ్ళినప్పుడు.. ఉదయమే లేచి సూర్యోదయాన్ని పలకరించినప్పుడు కలిగే అనుభూతి లాంటిది . సినిమా అయిపోయాక కూడా ఆ భావన లోనుండి రావడం చాలా కష్టం. ముఖ్యంగా రామ్ పాత్ర మనల్ని వెంటాడుతుంటే.. సీతామాలక్ష్మి నన్నెలా మరువగలవు  అంటూ నిలదీస్తుంది. ప్రతీ 15 సంవత్సరాలకూ ఒక తరం మారుతుంది అనే మాట నిజమైతే ఈ తరంలో ఇప్పటి వరకూ రాని క్లాసిక్ లవ్ స్టోరీ సీతారామం. హిందీ వీర్ ఝరా నుంచి అప్పుడెప్పుడో వచ్చిన కాలాపానీ పోలికలు చూచాయగా  కనిపించినా సీతారామం  ప్రత్యేకత వేరు. హను రాఘవపూడి పెన్నుతో కాకుండా మనసుతో రాసిన స్క్రీన్ ప్లే ఇది. సెకండాఫ్ చెడగొడతాడు అనే పేరుపడ్డ హను రాఘవపూడి చేతనైతే ఇంతకంటే చిక్కటి ప్రేమకథను తీయండి చూద్దాం అంటూ నవతరం దర్శకులకు ప్రేమతో విసిరిన సవాల్ సీతారామం. 

ఆద్యంతం కనిపించే దుల్కర్ - మృణాల్‌ల మాయాజాలం 

1983లో ప్రేమసాగరం అనే తమిళ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయింది. హీరో గంగ, హీరోయిన్ నళిని . నేటి తమిళ్ స్టార్ శింబు తండ్రి నటుడు టీ. రాజేందర్ ఆ సినిమాకు డైరెక్టర్ కమ్  మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళెవరూ నాటి తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం తెలియదు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే రాజమండ్రిలోని కుమారి థియేటర్ లో 365 రోజులు ఆడింది. కాలేజీ కురాళ్ళకి ప్రేమసాగరం ఒక కల్ట్ క్లాసిక్. ఆ పాటలను ఇప్పటికీ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎందుకు అంటే ఒక సినిమాను ఇష్టపడితే అందులోని నటులు ఎవరు అనేదానికన్నా సినిమాకే కనెక్ట్ అవడం తెలుగు ప్రేక్షకులకు ఉన్న ఒక లక్షణం. అలాగే 1989లో వచ్చిన ‘ప్రేమపావురాలు’, 1996లో వచ్చిన ‘ప్రేమదేశం’ కూడా దీనికి  ఉదాహరణలు. ఇదంతా ఎందుకంటే ‘సీతారామం’లో నటించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లను సినిమా రిలీజ్ తరువాత తెలుగు నటులలానే భావిస్తున్నారు ప్రేక్షకులు. అంతలా వాళ్ళని సొంతం చేసుకునేలా వాళ్ళ నటన సాగింది. తెలుగు సినిమా మర్చిపోయిన ఒకప్పటి నవలా నాయకుడిలా దుల్కర్ కనిపిస్తే .. కళ్ళతో నటించడం అంటే ఏమిటో మృణాల్ ఈ తరానికి గుర్తుచేసింది. ఇతర పాత్రల్లో కనిపించిన రష్మిక, సుమంత్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, సచిన్ ఖేడేకర్ లాంటి వాళ్ళు తమ వంతు సహాయం తాము చేసారు. ఇలాంటి ప్రేమకథలకు ఆయువుపట్టుగా ఉండాల్సిన కెమెరా వర్క్ ను పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణలు, మ్యూజిక్ విభాగాన్ని విశాల్ చంద్ర శేఖర్ సమర్ధవంతంగా నిర్వర్తించారు. అలా అనడం కంటే హను రాఘవపూడి ఊహలను వాళ్ళు ఆవాహన చేసుకుని మరీ ఈ సినిమాకు పనిచేసారేమో అనిపిస్తుంది . ముఖ్యంగా దుల్కర్ నటన ,సినిమాల ఎంపిక చూశాక మాస్ ఇమేజ్ వెంటపడుతున్న మన తెలుగు కుర్ర హీరోలు పునరాలోకనం చేసుకోవాల్సిన సమయం వచ్చేసిందనిపిస్తుంది. మృణాల్ అయితే ఈ తరం యువతకు మరో భాగ్యశ్రీ అని చెప్పినా ఎలాంటి అతిశయోక్తి లేదు.

అనేక అంశాలను స్పృశిస్తూ సాగే హృద్యమైన ప్రేమ కథే ‘సీతారామం’

ఈ మధ్య రిలీజ్ ఆయిన ప్రేమకథల్లోని లోపం ఏంటంటే.. ఒకపక్క హీరో - హీరోయిన్ మధ్య ప్రేమను నడుపుతూనే.. మధ్యలో వేరే అంశాలను చొప్పించడం వల్ల ప్రధాన కథలోని గాఢత దెబ్బతింటుంది. అందుకే ఆ సినిమాలు ప్రేక్షకుల మదిలో గాఢమైన ముద్రను వెయ్యలేకపోతున్నాయి. సీతారామలో ఆ సమస్యను విజయవంతంగా ఎలా దాటాలో హను రాఘవపూడి చేసి చూపాడు. టెర్రరిస్టుల అంశం నుంచి.. మతాల మధ్య దూరం .. ఇండియా - పాకిస్తాన్ సమస్య, నమ్మక ద్రోహాలు ఇలా అనేక అంశాలను స్పృశిస్తూనే అవన్నీ తాను అనుకున్న కథకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా రాసుకున్నాడు హను. ఈ కథకు సక్సెస్ అక్కడే నిర్ణయం అయిపోయింది. ఈ సినిమా ముగిశాక కళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చే ప్రేక్షకుడు.. కొంతసేపటి తరువాత మరోసారి  ‘సీతారామం’ను చూడాలని అనుకోవడానికి కారణం తాను అనుకున్న సినిమాను అనుకున్న విధంగా రూపొందించిన హను దర్శకత్వ ప్రతిభ. ఆయన్ని నమ్మి పెట్టుబడి పెట్టిన వైజయంతీ బ్యానర్.. దర్శకుడి ఊహలకు ప్రాణం పోసిన హీరో, హీరోయిన్ ల మనసును తాకే నటన. మీకు కూడా ఈ సినిమా నచ్చేస్తుంది.

Also Read : హలో వరల్డ్ రివ్యూ

Also Read : కడవర్ రివ్యూ

Published at : 14 Aug 2022 11:21 AM (IST) Tags: Sita Ramam Sitaramam Sita Ramam Review Sitaramam Review Sitarama audience Review Sita Ramam audience Review

ఇవి కూడా చూడండి

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్‌దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!

Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్‌దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!

Naga Panchami December 6th శివయ్య ఎదురుగానే ప్రాణం వదిలేస్తా.. షాకిచ్చిన పంచమి!

Naga Panchami December 6th శివయ్య ఎదురుగానే ప్రాణం వదిలేస్తా.. షాకిచ్చిన పంచమి!

Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!

Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!

Jagadhatri December 6th Episode : అవమానంతో రగిలిపోతున్న యువరాజ్.. మీనన్ హ్యాండ్ ఓవర్​లో ధాత్రి

Jagadhatri December 6th Episode : అవమానంతో రగిలిపోతున్న యువరాజ్.. మీనన్ హ్యాండ్ ఓవర్​లో ధాత్రి

టాప్ స్టోరీస్

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ