News
News
X

Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!

కొన్నాళ్లక్రితం ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

FOLLOW US: 

దుల్కర్ సల్మాన్(Dulquer Salman), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా.. రష్మిక(Rashmika) కీలకపాత్రలో నటించిన 'సీతారామం'(SitaRamam) సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మొదటి షో నుంచే హిట్ టాక్ వచ్చింది. ఇలాంటి అందమైన ప్రేమకథను తెలుగు తెరపై చూసి చాలా కాలమైంది. క్లాస్ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. యూత్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తోంది. లవ్ స్టోరీస్ లో ఇదొక క్లాసిక్ గా నిలిచిపోతుంది. 

ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మౌత్ టాక్ కూడా బావుంది. సోషల్ మీడియా జనాలు కూడా ఈ సినిమా చూసి చాలా ఎమోషనల్ గా స్పందిస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి బాధ 'సీతారామం' సినిమా బాగుందని కానీ.. 'రాధేశ్యామ్'(Radheshyam) సినిమా డిజాస్టర్ అయిందని. 

కొన్నాళ్లక్రితం ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ చాలా కాలం తరువాత నటించిన లవ్ స్టోరీ కావడంతో ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. 'బాహుబలి' సినిమా తరువాత మాస్ ఇమేజ్ నుంచి బయటకొచ్చి ఈ సినిమాలో నటించారు. దీనికోసం ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు పెట్టారు నిర్మాతలు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో రిచ్ నెస్ కనిపిస్తుంది. 

లొకేషన్స్, సెట్టింగ్స్ ఇలా ఏది చూసుకున్నా భారీతనమే. ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ అందరూ కూడా పెద్దవాళ్లే. రోమ్ సిటీలో షూట్ చేయాల్సిన కొన్ని సన్నివేశాలు మిగిపోతే.. దానికోసం హైదరాబాద్ లో స్పెషల్ సెట్ ను నిర్మించారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. కానీ కంటెంట్ లేకపోవడంతో ఈ భారీతనం దేనికీ పనికిరాకుండా పోయింది. సినిమాను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. 

ఇప్పుడేమో 'సీతారామం' సినిమా విడుదలై క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. 'రాధేశ్యామ్' సినిమాతో పోలిస్తే ఇందులో ఎలాంటి భారీ సెట్లు, హంగులు లేవు. ఎమోషన్స్ ను క్యారీ చేస్తూ సినిమా తీశారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ సినిమా చూసి 'రాధేశ్యామ్' దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. రకరకాల మీమ్స్ ను క్రియేట్ చేసి అతడికి ట్రోల్ చేస్తున్నారు. క్లాసిక్ లవ్ స్టోరీ అంటే ఇదీ అంటూ రాధాకృష్ణపై మండిపడుతున్నారు.   

Also Read : 'బింబిసార' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నందమూరి కళ్యాణ్ రామ్ భారీగా కొట్టాడుగా!

Also Read : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే

'సీతా రామం' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే...
నైజాం : రూ. 2.54 కోట్లు 
ఉత్తరాంధ్ర : రూ. 85 లక్షలు
సీడెడ్ : రూ. 65 లక్షలు
నెల్లూరు :  రూ. 23 లక్షలు
గుంటూరు :  రూ. 47 లక్షలు
కృష్ణా జిల్లా : రూ. 50 లక్షలు
తూర్పు గోదావ‌రి : రూ. 56 లక్షలు
పశ్చిమ గోదావ‌రి : రూ. 40 లక్షలు

ఏపీ, తెలంగాణ... మొత్తం మీద మూడు రోజుల్లో 6.20 కోట్ల రూపాయల షేర్  రాబట్టింది. గ్రాస్ వసూళ్లు అయితే... 11.65 కోట్ల రూపాయలు. 

Published at : 08 Aug 2022 03:43 PM (IST) Tags: Prabhas Radheshyam Radhakrishna Kumar Sita Ramam

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: నామినేషన్లో ఇనయా వయసుపై చర్చ, యాటిట్యూడ్ చూపించిన శ్రీహాన్

Bigg Boss 6 Telugu: నామినేషన్లో ఇనయా వయసుపై చర్చ, యాటిట్యూడ్ చూపించిన శ్రీహాన్

Janaki Kalaganaledu September 26th: జెస్సి, అఖిల్ ని జ్ఞానంబకి దగ్గర చేసేందుకు జానకి ప్రయత్నాలు- చెడగొట్టేందుకు మల్లిక కుట్రలు

Janaki Kalaganaledu September 26th: జెస్సి, అఖిల్ ని జ్ఞానంబకి దగ్గర చేసేందుకు జానకి ప్రయత్నాలు- చెడగొట్టేందుకు మల్లిక కుట్రలు

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Gruhalakshmi September 26th: సామ్రాట్ విషయంలో తగ్గేదెలే అన్న తులసి- 'నాన్న కానీ ఈ నాన్న'ని క్షమించమని హనీని అడిగిన సామ్రాట్

Gruhalakshmi September 26th: సామ్రాట్ విషయంలో తగ్గేదెలే అన్న తులసి- 'నాన్న కానీ ఈ నాన్న'ని క్షమించమని హనీని అడిగిన సామ్రాట్

Guppedanta Manasu September 26th Update: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో

Guppedanta Manasu September 26th Update: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో

టాప్ స్టోరీస్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం