News
News
X

Allu Sirish: అల్లు శిరీష్ సినిమాకి కొత్త టైటిల్ - టీజర్ ఎప్పుడంటే?

అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఒక సినిమాను రూపొందించింది.

FOLLOW US: 

అల్లు శిరీష్(Allu Sirish) హీరోగా నటించిన 'ఎబిసిడి' సినిమా మే, 2019లో విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లలోకి మరో సినిమాతో రాలేదు. కరోనా కారణంగా ప్రతి సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలా శిరీష్ జర్నీకి కొవిడ్ బ్రేకులు వేసింది. 'ఎబిసిడి' సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, అల్లు శిరీష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా విడుదలైన మూడేళ్లకు మరో సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. 

Sirish and Anu’s film titled Urvasivo Rakshasivo: అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఒక సినిమాను రూపొందించింది. ఆ మధ్య ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. 'ప్రేమ కాదంట' (Prema Kadanta Movie) టైటిల్‌తో వచ్చిన ఆ సినిమాకు రాకేశ్ శశి దర్శకుడు. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మార్చినట్లు తెలుస్తోంది. కొత్త టైటిల్ ఏంటంటే.. 'ఊర్వశివో రాక్షసివో'. 

కొత్త టైటిల్ తో రిలీజ్ చేసిన పోస్టర్ యూత్ ను ఆకర్షించేలా ఉంది. శిరీష్, అను ఇమ్మాన్యూల్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్ధమవుతుంది. ఈ సినిమా టీజర్ ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

నవంబర్ 4న (Allu Sirish New Movie Release Date) ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు సమంత 'శాకుంతలం' కూడా అదే రోజున రాబోతుంది. అయితే ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ కి చెందినవి. అల్లు శిరీష్ కి ఇప్పుడు సక్సెస్ చాలా ముఖ్యం. మరి తను ఆశిస్తున్నట్లుగా ఈ సినిమా హిట్ అవుతుందేమో చూడాలి. 

News Reels

ఇక శిరీష్ కెరీర్ చూస్తే... 'గౌరవం' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా తమిళంలో కూడా విడుదల అయ్యింది. 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు', 'ఒక్క క్షణం' వంటి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. తన కంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. మలయాళంలో మోహన్ లాల్‌తో '1971 : బియాండ్ బోర్డర్స్' సినిమా చేశారు.

Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Also read: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Published at : 26 Sep 2022 03:04 PM (IST) Tags: Anu Emmanuel geetha arts Allu sirish Urvasivo Rakshasivo

సంబంధిత కథనాలు

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు: అడివి శేష్

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు:  అడివి శేష్

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో  - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Chiranjeevi IFFI Award : ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్న చిరంజీవి | ABP Desam

Chiranjeevi IFFI Award : ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్న చిరంజీవి | ABP Desam