Bigg Boss 6 Telugu: కొడుకుతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి - అందరి దృష్టి ఇనయా, సత్యా పైనే!
బిగ్ బాస్ ఇంట్లోకి కొడుకుతో ఎంట్రీ ఇచ్చింది సిరి. ఆ పిల్లాడి ముద్దు ముద్దు మాటలకు హౌస్‌మేట్స్ అంతా ఫిదా అయ్యారు. పనిలో పనిగా సిరి.. శ్రీహన్‌కు మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చింది.
మూడు వారాల్లో ‘బిగ్ బాస్’ సీజన్ 6 ముగియనుంది. ప్రతి సీజన్ లో 10వ వారంలోనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేవారు. ఈసారి మాత్రం 12వ వారంలో కుటుంబసభ్యులని అనుమతించారు. ఇప్పటికే ఆదిరెడ్డి భార్య, రోహిత్ తల్లి, రాజ్ తల్లి, ఫైమా అమ్మ, శ్రీ సత్య తల్లిదండ్రులు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. వారితో అందరూ చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు శ్రీహాన్ వంతు వచ్చింది. శ్రీహాన్ కోసం రెండు సర్ ప్రైజ్ లు వచ్చేశాయి. ఒకటి సిరి అయితే రెండోది తన కొడుకు. వాళ్ళని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు. సిరి వచ్చి శ్రీహాన్ ని హగ్ చేసుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రోమో వదిలారు.
ఇక ప్రోమోలో ఏముందంటే ఇంట్లో అందరినీ ఫ్రీజింగ్ పొజిషన్లో ఉండమని బిగ్ బాస్ చెప్తారు. అప్పుడు ఇంట్లోకి సిరి ఎంట్రీ ఇస్తుంది. సిరి శ్రీహాన్ ని ప్రేమగా హగ్ చేసుకుని ‘బిగ్ బాస్’కి ఐ లవ్యూ చెప్తుంది. ఇంట్లో వాళ్ళందరితో చాలా సరదాగా మాట్లాడుతుంది. ‘‘ఏంటి ఇనయా ఈ మధ్య మావాడి మీద కాన్సెన్స్ట్రేట్ చేయడం లేదు’’ అని సిరి అడిగింది. తర్వాత తన మెడ మీద శ్రీహాన్ అని వేయించుకున్న పచ్చబొట్టు చూపిస్తుంది. అది చూసి శ్రీహాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
అప్పుడే శ్రీహాన్ కొడుకు కూడా ఇంట్లోకి వచ్చాడు. డాడీ అని ముద్దుగా పిలిచాడు. పిల్లాడిని ఎత్తుకుని శ్రీహాన్ తెగ మురిసిపోయాడు. బుడ్డోడు భలే క్యూట్ గా రేవంత్ ని ఇమిటేట్ చేశాడు. ‘‘ఇనయాకి డాడీకి గొడవ అయ్యింది కదా డాడీ ఏమని అన్నారు’’ అని సిరి చైతుని అడగ్గా ’’వాడు వీడు ఏంటి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు’’ అని తన ముద్దు ముద్దు మాటలతో చెప్పాడు. ఆ మాటలు విని ఇంట్లో అందరూ తెగ నవ్వుకున్నారు. ఈ ప్రోమో మాత్రం చాలా క్యూట్ గా అనిపించింది. గతంలో సిరి ఇంట్లో ఉన్న సమయంలో శ్రీహాన్ బిగ్ బాస్ వచ్చాడు. అయితే అప్పుడు ఇంట్లోకి కాకుండా బిగ్ బాస్ స్టేజ్ మీద మాత్రమే కనిపించాడు.
బుధవారం ఎపిసోడ్లో కన్ఫెషన్ రూమ్ నుంచి రోహిత్ తల్లి వచ్చారు. ఇంటి సభ్యులతో ప్రేమగా మాట్లాడారు. అందరికీ తినిపించారు. ఆదిరెడ్డి డ్యాన్సు అదిరిపోయిందని చెప్పారు. ఆమెకు తెలుగు సరిగా రాక పోవడంతో హిందీలో మాట్లాడారు. అందరి కుటుంబసభ్యులు వస్తున్నప్పుడు కీర్తి బాధను దిగమింగుకుంటున్నట్లు కనిపించింది. ఆమెకు తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరూ లేరు. బంధువులంతా దూరం పెట్టారు. దీంతో ఆమె తరపున ఎవరు వస్తారో అన్న ఆత్రుత ఆమెలోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా ఉంది.
Also Read: అలాంటి హీరోయిన్లు నాకు అస్సలు నచ్చరు - రిషబ్ కౌంటర్ రష్మికకేనా?
కాగా ఈ వారం శ్రీహాన్ ఆరు ఓట్లు, ఫైమాకి మూడు ఓట్లు, రోహిత్‌కి మూడు ఓట్లు, రాజ్‌కి రెండు ఓట్లు, ఆదిరెడ్డికి రెండు ఓట్లు, ఇనాయకు రెండు ఓట్లు పడ్డాయి. కీర్తిని ఎవరూ నామినేట్ చేయలేదు. ఇక రేవంత్ కెప్టెన్ అవ్వడంతో ఎవరూ నామినేట్ చేయలేకపోయారు. అంటే రేవంత్, కీర్తి తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు. ఈసారి ఇంటి నుంచి ఎవరు వెళతారో అంచనా వేసేస్తున్నారు ప్రేక్షకులు. రాజ్ లేదా రోహిత్.. వీరిద్దరిలో ఒకరు బయటికి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు భావిస్తున్నారు.
Also read: ఫ్యామిలీని కలిసిన ఇంటి సభ్యులు - బిగ్‌బాస్ హౌస్‌లో ఆదిరెడ్డి భార్య, రాజ్ తల్లి