అన్వేషించండి

Bigg Boss 6 Telugu: ఫ్యామిలీని కలిసిన ఇంటి సభ్యులు - బిగ్‌బాస్ హౌస్‌లో ఆదిరెడ్డి భార్య, రాజ్ తల్లి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 కథ కంచికి చేరుతోంది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ కూడా మొదలైపోయింది.

Bigg Boss 6 Telugu: ఫ్యామిలీ వీక్ వచ్చిందంటే ఇంతకుముందు ఫ్రీజ్ - రిలీజ్ అంటూ ఓ ఆట ఆడేవారు. ఫ్యామిలీ మెంబర్ వచ్చినప్పుడు ఫ్రీజ్ అని చెప్పి వారు వచ్చాక రిలీజ్ అని చెప్పేవారు. ఇప్పుడు అలాంటిదేం ఆడించలేదు. బిగ్‌బాస్ ఇంటిని బీబీ కోచింగ్ సెంటర్ గా మార్చారు. ఇందులో ఫైమా ఇంగ్లిష్ టీచర్, ఆదిరెడ్డి డ్యాన్సు టీచర్, శ్రీసత్య మేకప్ టీచర్‌లా వ్యవహరించింది. ఫైమా క్లాస్ స్పెల్లింగు కూడా సరిగా రాయకపోవడంతో అందరూ నవ్వారు. ఎలిఫేంట్ స్పెల్లింగ్ కూడా ఆమె రాయలేక మధ్యలోనే ఆపేసింది. ఆమె మధ్యమధ్యలో మాట్లాడే ఇంగ్లిస్ అందరినీ నవ్వించింది. 

ఇక శ్రీసత్య మేకప్ క్లాస్ తీసుకుంది. ఇందులో మేకప్ అంటే ఏమిటి అని అడిగింది పిల్లల్లా మారిన ఇంటి సభ్యులను. రేవంత్ ‘మేకు అప్‌లో కొడితే అదే మేకప్’ అని చెప్పగా, రాజ్ ‘కప్పులో మేకు వేస్తే అదే మేకప్’ అని చెప్పి కామెడీ చేశాడు. తరువాత శ్రీహాన్ కు మేకప్ వేశారు. తరువాత ఆదిరెడ్డి డ్యాన్సు క్లాసు తీసుకున్నారు. ఆయన డ్యాన్సు చేస్తుంటే ప్రతి ఒక్కరూ నవ్వుకున్నారు. 

ఆదిరెడ్డి భార్య...
మధ్యలో ఆదిరెడ్డి భార్యా, కూతురిని ఇంట్లోకి పంపించారు బిగ్ బాస్. ఏడాది వయసున్న ఆ కూతురు తండ్రిని గుర్తు పట్టలేకపోయింది. ఎక్కువసేపు ఏడుస్తూనే కనిపించింది. వారిద్దరికీ ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఆ చిన్నారి. తన డ్యాన్సు గురించి అడిగాడు ఆదిరెడ్డి. చూసి నవ్వుకుంటున్నాం అని చెప్పింది భార్య. గేమ్‌లో కొట్టుకున్న తిట్టుకున్నా కలిసిమెలిసి ఉండమని చెప్పింది కవిత. దానికి ఆదిరెడ్డి ‘నన్ను కూడా కొట్టమంటావా’ అని అడిగాడు. దానికి ‘ఆ... నువ్వేమైన తోపా’ అని నాగార్జున డైలాగ్ ఇచ్చిపడేసింది. 

ఇక కాసేపటి తరువాత రాజ్ తల్లి ఇంట్లోకి వచ్చారు. ఆవిడ వస్తూనే కొడుకుని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కాటుకతో దిష్టి చుక్క పెట్టి, చేతికి తాయెత్తు కట్టారు. విన్నర్ అయి రావాలంటూ దీవించారు. రాజ్ తల్లి అందరూ బాగా ఆడుతున్నారంటూ మెచ్చుకుంది. ఇక రాజ్ తన తల్లిని ప్రపంచానికి చూపించానని ఆనంద పడ్డాడు. ఈ సీన్ అంతా చూసి కీర్తి, రేవంత్, రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నారు.   

కాగా ఈ వారం నామినేషన్లలో రేవంత్, కీర్తి తప్ప మిగతా వారందరూ ఉన్నారు. వీరిలో ఇనాయ టాప్ ప్లేసులో ఉన్నట్టు సమాచారం. ఇక రెండో స్థానానికి ఎవరూ ఊహించని విధంగా రోహిత్ దూసుకొచ్చాడు. శ్రీహాన్, ఆదిరెడ్డి మూడో స్థానం కోసం పోటీ పడుతున్నారు. రాజ్ నాలుగో స్థానంలో ఉండగా, శ్రీసత్య, ఫైమాలలో ఒకరు ఈ వారం బయటికి వెళ్లొచ్చు. అయితే ఫైమా చేతిలో ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉంది కాబట్టి, ఆమె తనను సేవ్ చేసుకుంటుంది. ఇక శ్రీసత్య బయటికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆమె ఇన్నాళ్లు ఇంట్లో ఉండడమే ఎక్కువ. చాలా  నెగిటివిటీని కూడా సంపాదించింది. 

Also read: ఆదిరెడ్డికి బిగ్‌బాస్ భారీ సర్‌ప్రైజ్, అతని భార్యా బిడ్డ ఎంట్రీ - మధ్యలో రేవంత్ కన్నీళ్లు

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget