‘సింహాద్రి’ రీరిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్ - న్యూ రిలీజ్‌కు కూడా ఇంత రాదేమో!
తారక్ బర్త్ డే సందర్భంగా ఇటీవలే రీరిలీజ్ అయిన 'సింహాద్రి' బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటిరోజే దాదాపు రూ.5.2కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఆల్ టైమ్ రికార్డ్ మూవీస్ లో చోటు దక్కించుకుంది
Simhadri : ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో భారీ అంచనాల నడుమ 9 జులై 2003వ సంవత్సరంలో విడుదలైన 'సింహాద్రి'(Simhadri) మరో సారి ట్రెండింగ్ లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు సందర్భంగా మే 20న మేకర్స్ ఇటీవలే మరోసారి థియేటర్లలో రిలీజ్ చేశారు. భూమిక చావ్లా , అంకిత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి 'సింహాద్రి' అదే కలెక్షన్లను కొనసాగిస్తోంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.5.2 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. దీంతో 'సింహాద్రి' 'ఆల్ టై రికార్డ్ సినిమా'ల జాబితాలో మరోసారి చేరిపోయింది.
టాలీవుడ్ లో ఇటీవల రీరిలీజ్ అయిన పలు సినిమాలు ఇప్పటికే రికార్డు స్థాయిలో వసూళ్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఆ జాబితాలో అల్లు అర్జున్ దేశముదురు, పవన్ కల్యాణ్ ఖుషీ, జల్సా, మహేశ్ బాబు పోకిరి, రామ్ చరణ్ 'ఆరెంజ్ 'లు కూడా ఉన్నాయి. రీరిలీజ్ అయిన సినిమాలలో 3.62 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో పవన్ కళ్యాణ్ హీరోగా నటించి ‘ఖుషి’ మూవీ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పుడు దాన్ని సింహాద్రి మూవీ బీట్ చేసింది. ఇటీవలి కాలంలో కొత్తగా విడుదలైన సినిమాలకు కూడా ఈ రేంజ్ లో కలెక్షన్లు రావడం లేదు. అలాంటి రీరిలీజ్ అయిన ఈ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో. ఇక సీడెడ్‌లో ఏకంగా రూ.76 లక్షలు సాధించి అక్కడ తన బ్రాండ్ ఏంటో మరోసారి రుజువు చేశాడు. భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఆ స్థాయిలో సీడెడ్‌లో కలెక్షన్‌లు సాధించలేపోయాయి.
All Time Record for Man of Masses NTR’s #Simhadri4K Re-Release with staggering 5.2cr Gross on Day 1 💥#Simhadri #HappyBirthdayNTR #ManOfMassesNTR pic.twitter.com/MvvvYhRisF
— Vamsi Kaka (@vamsikaka) May 21, 2023
విజయేంద్ర ప్రసాద్ 'సింహాద్రి'కి కథను అందించగా.. కీరవాణి సంగీతం సమకూర్చారు. 4కే వెర్షన్ లో థియేటర్లకు వచ్చిన ఈ సినిమా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎంతో స్పెషల్ గా మారింది. ఎన్టీఆర్ ని మాస్ ఆడియన్స్ హృదయాల్లో చిరస్థాయిగా చెరిగిపోని ముద్ర వేసిన చిత్రంగా నిలిచిపోయింది. సినిమా విడుదల కావడం ఇదే మొదటిసారి అన్నట్టు మార్నింగ్ షోల నుంచే చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. గతంలో పవన్ కల్యాణ్ 'ఖుషి', 'జల్సా' సినిమాలు రీరిలీజ్ అయినప్పుడు కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో క్రేజ్ రావడం సింహాద్రికే దక్కింది.
ఇక ఈ సినిమా రీరిలీజ్ కు దాదాపు నెల రోజుల నుంచీ విపరీతమైన పబ్లిసిటీ మొదలైంది. పది రోజుల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సెలబ్రెటీస్ ను పిలిచి గ్రాండ్ గా కూడా సెలబ్రేట్ చేశారు. అందుకోసం దాదాపు రూ.5 కోట్లు ఖర్చు అయినట్టు టాక్ కూడా వినిపిస్తోంది. అంత ఖర్చు చేసినందుకు మంచి ఫలితం దక్కుతుందని ఎన్టీఆర్, నందమూరి ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
Read Also : లండన్ థియేటర్‌లో తారక్ ఫ్యాన్స్ హంగామా - మూవీ నిలిపివేత