News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Chinna Trailer: మ‌న‌సుకు హ‌త్తుకుంటున్న సిద్ధార్థ్ ఎమోషన్ థ్రిల్లర్- `చిన్నా` ట్రైల‌ర్ విడుద‌ల

హీరో సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘చిన్నా’. ఇప్పటికే తమిళంలో విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

కోలీవుడ్ నటుడు సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘చిత్త’. ఈ నెల 28న తమిళనాట విడుదలైంది. తొలి షో నుంచే మంచి టాక్ సంపాదించుకుంది. సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సిద్ధార్థ్ కెరీర్ లోనే అద్భుతమైన సినిమాగా అభివర్ణిస్తున్నారు. తల్లిదండ్రులు ఈ సినిమాను తప్పకుండా చూడాలని చెప్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెలుగులోకి రాబోతోంది. ‘చిన్నా’ పేరుతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది.   

ఆకట్టుకుంటున్న ‘చిన్నా’ ట్రైలర్

తాజాగా ‘చిన్నా’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. సిద్ధార్థ్ ఇప్పటి వరకు చేయని డీగ్లామర్ రోల్ ఈ సినిమాలో చేశారు. ఈ ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చూసిన ప్ర‌తి ఒక్క‌రిలోనూ స‌రికొత్త ఆలోచ‌న‌ల‌ను రేకెత్తిస్తున్నది. సిద్ధార్థ్ మునుపెన్న‌డూ చేయ‌ని పాత్ర‌లో కనిపించారు.  ఇందులో సిద్ధార్థ్ పెర్ఫార్మెన్స్ ని చూసిన వారంద‌రూ ఆయ‌న కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా ప్ర‌శంసిస్తున్నారు.  చిన్నాన్న, కూతురు మధ్య జరిగే భావోద్వేగ కథ ఈ సినిమా. స్కూలుకు వెళ్లే బాలికకు చిన్నాన్నగా సిద్ధార్థ్ అద్భుతమైన నటన కనబర్చారు. ఆ అమ్మాయి తప్పిపోవడంతో చిన్నాన్న పడే బాధ, ఆవేదనను దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాను ఒకేసారి తమిళం, కన్నడలో విడుదల చేశారు. ఇప్పుడు తెలుగులో ‘చిన్నా’గా వస్తోంది. సిద్ధార్థ్ సమర్పణలో ఎటాకి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏషియ‌న్ సినిమాస్ ద్వారా తెలుగులో విడుదల చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు బాలాజీ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ అందించారు.  

తెలుగులో అక్టోబర్ 6న విడుదల

`చిన్నా` చిత్రానికి ఎస్‌.యు.అరుణ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మిళంలో `ప‌న్న‌యారుం ప‌ద్మినియుం`, `సేతుప‌తి` సినిమాల‌తో  డైర‌క్ట‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు అరుణ్‌కుమార్‌. ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరసన మలయాళ నటి నిమిషా సజయన్ నటించారు. సిద్ధార్థ్ అన్న కూతురిగా సహస్ర శ్రీ నటించింది. ఈ చిన్నారి పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా ఉండబోతోంది. తెలుగులో ఈ సినిమా 28న విడుదల కావాల్సి ఉన్నా, ‘స్కంద’, ‘చంద్రముఖి 2’, ‘పెదకాపు’ సినిమాలు క్యూ కట్టడంతో అక్టోబరు 6కు వాయిదా వేశారు.    

 ఒకప్పుడు తెలుగులో మంచి ఫాలోయింగ్

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సిద్ధార్థ్. ఈయనకు అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కానీ, ఆ తర్వాత ఆయన నటించిన పలు సినిమాలు పరాజయం పాలయ్యాయి. నెమ్మదిగా తెలుగులో తన మార్కెట్‌ను కోల్పోయారు. రెండేళ్ల క్రితం ‘మహా సముద్రం’ సినిమాతో సిద్ధార్థ్ మళ్లీ తెలుగులోకి వచ్చినా, పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ‘టక్కర్’ అనే సినిమాతో వచ్చారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఎమోషనల్ థ్రిల్లర్‌ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

Read Also: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 01 Oct 2023 10:59 AM (IST) Tags: Siddharth Chinna Movie Chinna Movie trailer s u arun kumar Dhibu Ninan Thomas

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

Nagarjuna Shirt Rate: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?

Nagarjuna Shirt Rate: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?

Bigg Boss 7 Telugu: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: తెలంగాణలో పోల్‌ కౌటింగ్ షురూ- పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ముందంజ

Telangana Election Results 2023 LIVE: తెలంగాణలో పోల్‌ కౌటింగ్ షురూ- పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ముందంజ

Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం

Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం

Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?

Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?

DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!

DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!
×