News
News
X

Sid Sriram New Telugu Song : సిద్ శ్రీరామ్ సాంగ్ - ఆది ఖాతాలో మరో హిట్ సాంగ్!

Vennela Vennela Sung By Sid Sriram Releasing On November 25th : ఆది సాయి కుమార్ 'టాప్ గేర్'లో సిద్ శ్రీరామ్ 'వెన్నెల వెన్నెల' సాంగ్ పాడారు. దీంతో ఆది ఖాతాలో మరో హిట్ సాంగ్ పడినట్టేనా!?

FOLLOW US: 

సిద్ శ్రీరామ్ (Sid Sriram) కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాణీ నచ్చితే చాలు... చిన్న పెద్ద తేడాలు లేకుండా పాట పాడతారు. ఈ ఏడాది సిద్ శ్రీరామ్ పాడిన హిట్ సాంగ్స్‌లో 'బాగుంటుంది నువ్వు నవ్వితే...' ఒకటి. అది ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) 'అతిథి దేవో భవ' సినిమాలోనిది. గత ఏడాది సిద్ శ్రీరామ్ హిట్ సాంగ్స్‌లో ఒకటైన 'ఒకే ఒక లోకం నువ్వే' సాంగ్ కూడా ఆది సాయి కుమార్ సినిమాలోనిదే. 'శశి'లో పాట అది. ఇప్పుడు వీళ్ళ కలయికలో మరో సాంగ్ వస్తోంది.  

లవ్లీ హీరో ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటించిన సినిమా 'టాప్ గేర్' (Top Gear Telugu Movie). ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ అనుబంధ సంస్థ ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహించారు. ఇందులో తొలి పాటను శుక్రవారం విడుదల చేస్తున్నారు. 

నవంబర్ 25న 'వెన్నెల... వెన్నెల'
'టాప్ గేర్' చిత్రంలో 'వెన్నెల వెన్నెల...' పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాటను నవంబర్ 25న సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.  

డిసెంబర్ 30న 'టాప్ గేర్'  
పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టాప్ గేర్' సినిమాను డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ''ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందించాం'' అని దర్శకుడు శశికాంత్ తెలిపారు. ''సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి'' అని కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాత చెప్పారు.

News Reels

Also Read : కృష్ణ భోజన ప్రియుడు - ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా?

ఆదికి జోడీగా రియా! 
'టాప్ గేర్'లో ఆది సాయి కుమార్ జోడీగా రియా సుమన్ (Riya Suman) నటించారు. ఈ సినిమా కంటే ముందు 'పేపర్ బాయ్', నేచురల్ స్టార్ నాని 'మజ్ను' సినిమాల్లో ఆమె నటించారు. ఇంకా ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారని దర్శక నిర్మాతలు తెలిపారు. 'జులాయి', 'అత్తారింటికి దారేది', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి తమ సినిమా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారని కేవీ శశ్రీధర్ చెప్పారు. శ్రీవిష్ణు 'అల్లూరి', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సాక్ష్యం' తదితర చిత్రాలకు పని చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. 

బ్రహ్మాజీ, 'సత్యం' రాజేష్, మైమ్ గోపి, నర్రా శ్రీనివాస్, శత్రు, బెనర్జీ, 'చమ్మక్' చంద్ర, 'రేడియో మిర్చి' హేమంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కళ : రామాంజనేయులు, ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్, కూర్పు : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : గిరిధర్ మామిడిపల్లి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశికాంత్, నిర్మాత : కేవీ శ్రీధర్ రెడ్డి.

Published at : 22 Nov 2022 08:08 AM (IST) Tags: Sid Sriram aadi sai kumar Riya Suman Top Gear Telugu Movie Vennela Vennela Lyrical

సంబంధిత కథనాలు

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Simbu Song In 18 Pages : నిఖిల్ కోసం శింబు పాట - టైమ్ ఇవ్వు పిల్లా 

Simbu Song In 18 Pages : నిఖిల్ కోసం శింబు పాట - టైమ్ ఇవ్వు పిల్లా 

Top Gear Movie Song : వెన్నెల వెన్నెల - ఆది, రియా పెళ్లి తర్వాత వచ్చే పాట

Top Gear Movie Song : వెన్నెల వెన్నెల - ఆది, రియా పెళ్లి తర్వాత వచ్చే పాట

Vijay Devarakonda : దర్శకులను దూరం చేసుకుంటున్న విజయ్ దేవరకొండ - యాటిట్యూడ్ కారణమా?

Vijay Devarakonda : దర్శకులను దూరం చేసుకుంటున్న విజయ్ దేవరకొండ - యాటిట్యూడ్ కారణమా?

Guppedantha Manasu November 26th Update: జగతికి రిషి సేవలు, మహేంద్ర మాట వినని రిషి, హాస్పిటల్లోకి ఎంట్రీ ఇచ్చిన దేవయాని

Guppedantha Manasu November 26th Update: జగతికి రిషి సేవలు, మహేంద్ర మాట వినని రిషి, హాస్పిటల్లోకి ఎంట్రీ ఇచ్చిన దేవయాని

టాప్ స్టోరీస్

Gujarat Riots: అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం "నేరస్థులను విడుదల చేయాలనే కదా" - ఒవైసీ కౌంటర్

Gujarat Riots:  అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

Telangana News :  తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే -  డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం - ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం -  ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

ISRO PSLV-C54: ఇస్రో మరో రికార్డ్, పీఎస్‌ఎల్వీ సీ-54 ప్రయోగం విజయవంతం

ISRO PSLV-C54: ఇస్రో మరో రికార్డ్, పీఎస్‌ఎల్వీ సీ-54 ప్రయోగం విజయవంతం