Madhuranagarilo July 22th: శ్యామ్ ను అడ్డంగా ఇరికించిన వాసంతి.. రాధకు ముద్దు పెట్టడానికి ఫిక్సయిన శ్యామ్?
కోయా దొర వేషంలో శ్యామ్ మధుర వాళ్లకు దొరికిపోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Madhuranagarilo July 22th: శ్యామ్ అన్నం తినలేదని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన పండు తనకు ఆకలి వేస్తుంది అని అంటాడు. దాంతో శ్యామ్ కూడా అన్నం తినలేదు అని బెల్లీ శ్యామ్ అన్నం తినేటట్టు చేయమని చెబుతుంది రాధ. ఇక శ్యామ్ దగ్గరికి వెళ్ళగా పండు ఎందుకలా చేస్తున్నావు నువ్వు చేసిన పని బాలేదు నువ్వు చేసిన తప్పుకు మమ్మీకి సారీ చెప్పాలి అని ఓ రేంజ్ లో యాక్టింగ్ చేయడంతో వెంటనే రాధ నిజం చెప్పిందేమో అని భయపడతాడు.
నువ్వు మమ్మీ కి సారీ చెప్పకపోతే నువ్వు భోజనం చేయకపోతే ఈ విషయం వెళ్లి నానమ్మకు చెబుతాను అని బెదిరిస్తాడు. దాంతో శ్యామ్ బయపడి రాధకు సారి చెబుతాడు. ఆ తర్వాత ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు. ఇక పండు ఇంకోసారి అన్నం తినకుండా ఉండొద్దు అని ఇలాంటి తప్పు చేస్తే బాగోదు అని.. లేదంటే మళ్లీ మమ్మీ కి సారీ చెప్పాల్సి వస్తుంది అనేటమ్తో వెంటనే శ్యామ్ అంటే తను అన్నం తినలేదని ఇలా అన్నాడా అనుకుంటాడు. ఎలాగైతే ఏమి రాధ మాత్రం సారీ ఏదో చెప్పించుకుంది కదా అనుకుంటాడు.
సీన్ కట్ చేస్తే.. రింగ్ చేతికి ఉండటంతో గోపాల్ తేడాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. విల్సన్ కు మందు పోస్తూ ఉండగా తేడా తేడాగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే గన్నవరం వచ్చి తనకు మందు పోయమని అంటాడు. దాంతో గోపాల్ కాస్త డిఫరెంట్ గా తిడతాడు. వీడేంటి తేడాగా మాట్లాడుతున్నాడు అని అనటంతో అప్పటినుంచి అలాగే మాట్లాడుతున్నాడు అని విల్సన్ అంటాడు.
ఇక విల్సన్ తన భార్య బాధపడుతున్న విషయాన్ని గన్నవరం కి చెప్పి బాగా తాగి కుప్పకూలుతాడు. ఇక ఇంట్లో వదిలి పెట్టేద్దాం అని గన్నవరం అనడంతో లేదు ఇక్కడే ఉంచుకుంటాను అని తేడాగా అంటాడు గోపాల్. దాంతో గన్నవరం కాస్త అనుమానం పడతాడు. ఆ తర్వాత కోయదొరవేషలో శ్యామ్ రాధకు పెళ్లి జరిగిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి రాధ ఇంటికి వెళ్తాడు.
అప్పటికే రాధ పండు తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బయట కోయదొర మాటలు విని పండు నాన్న గురించి ఏమైనా తెలుస్తుందేమో అని బయటికి వెళుతుంది. పండుని చూపించి ఆ బాబు తండ్రి ఎక్కడ ఉన్నాడో చెప్పమని అంటుంది. బాబు తండ్రి అంటున్నావు మీ ఆయన అనొచ్చు కదా అని శ్యామ్ అంటాడు. దాంతో రాధ అతనిపై కోపం అవుతుంది.
ఇక రాధ చేయి పట్టుకొని నీకు పెళ్లి కాలేదని జాతకంలో ఉందనటంతో నాకు పెళ్లి అయింది అని రాధ అంటుంది. నువ్వు నిజం ఒప్పుకుంటేనే పండు వాళ్ళ నాన్న గురించి చెబుతాను అనడంతో.. నేను పండు అని పేరు చెప్పలేదు కదా అని అనుమానంతో అడుగుతుంది. దాంతో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇటువంటి పేర్లు ఉంటాయి కదా అని కవర్ చేస్తాడు. కానీ రాధ మాత్రం అతడు శ్యామ్ అని అనుమానం పడి.. శ్యామ్ కి ఫోన్ చేయటంతో ఆ ఫోన్ రింగ్ అవ్వటం వల్ల అతడే శ్యామ్ అని పసిగడుతుంది.
దానితో ఇలా చేస్తావని కొట్టడానికి వెళుతుంది. మరోవైపు ఇంటి పెయింట్స్ ఎలా ఉన్నాయి అని కోడల్ని అడుగుతూ ఉంటుంది మధుర. మీరు ఏదైనా బాగానే సెలెక్ట్ చేస్తారు అంటూ డైలాగులు చెబుతుంది సంయుక్త. అప్పుడే శ్యామ్ ఇంట్లోకి పరిగెత్తుకొని రావటంతో ఎవరో అనుకోని కొట్టడానికి ప్రయత్నిస్తుంది మధుర. వెంటనే తన గెటప్ తీసి మమ్మీ అనటంతో ఇలా ఎందుకు వేషం వేసుకున్నావు అని అడుగుతుంది.
అప్పుడే వాసంతి రాధ కోసం అని.. రాధ పెళ్లి చేసుకుందా లేదా అని తెలుసుకోవడం కోసం వేసుకున్నాడని చెప్పడంతో వెంటనే మధుర తనకు పెళ్లయి బాబు కూడా ఉన్నాడు కదా అని అనుమానంతో అడుగుతుంది. అంటే రాధ వాళ్ళ భర్త కూడా ఉంటే తనను మనం వెతికి తీసుకువచ్చి రాధకు మంచి చేయాలని కవర్ చేస్తాడు. తరువాయి భాగంలో కిరణ్ ఇచ్చిన సలహాతో రాధకు ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తాడు శ్యామ్.
also read it : Prema Entha Madhuram July 22th: అనుకి రింగ్ గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. నీరజ్ ను కాపాడటానికి ప్లాన్ చేసిన ఆర్య?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial