News
News
X

Adipurush: 'ఆదిపురుష్' సినిమాకి షాకింగ్ రన్ టైం - మూడు గంటలకు పైగానే!

ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాకి రన్ టైం లాక్ చేసినట్లు సమాచారం.

FOLLOW US: 
 
ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'(Adipurush). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇటీవల విడుదలైన సినిమా టీజర్ అంచనాలు తారుమారయ్యేలా చేసింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టీజర్‌లోని సన్నివేశాలు కార్టూన్ మూవీని తలపించాయి. అలాగే వానర సేనను కూడా అభ్యంతరకరంగా చూపించారని, VFX సీన్స్ మరీ దారుణంగా ఉన్నాయని ట్రోల్ చేశారు.

దిద్దుబాటు చర్యల్లో భాగంగా త్రీడీ టీజర్ ను మీడియాకు చూపించి నెగెటివిటీను తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ.. జనాల్లో మాత్రం సినిమా మీద పూర్తి భరోసా అయితే లేదు. ఈ క్రమంలో వీలైనన్ని ఎక్కువ కరెక్షన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన జెన్యూన్ ఫీడ్ బ్యాక్ తీసుకొని ఆ మేరకు మార్పులు చేయడానికి చూస్తున్నారట. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి రన్ టైం లాక్ చేసినట్లు సమాచారం.

3 గంటల 15 నిమిషాల నిడివితో 'ఆదిపురుష్' సినిమా ఉంటుందట. ఇంత లెంగ్త్ అంటే సినిమాలో కంటెంట్ ఓ రేంజ్ లో ఉండాలి. రాజమౌళి సినిమాలన్నీ మూడు గంటలకు దగ్గరగానే ఉంటాయి. కానీ ఆయన సినిమాలు జనాలకు బోర్ కొట్టవు. అందుకే ఎన్ని నిడివితో సంబంధం లేకుండా సినిమాలు చూస్తుంటారు. ఇప్పుడు ఓం రౌత్ 'ఆదిపురుష్' ఫైనల్ కట్ ను మూడు గంటల పదిహేను నిమిషాలకు లాక్ చేశారు. మరి అంతసేపు జనాలను థియేటర్లలో కూర్చోబెట్టే కంటెంట్ ఉందో లేదో చూడాలి. 

ఓం రౌత్ కి మాత్రం సినిమాపై చాలా నమ్మకం ఉంది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. 'బాహుబలి' తరువాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో ఇబ్బంది పడుతున్నారు ప్రభాస్. ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. లేదంటే ట్రోలింగ్ తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.

News Reels

మార్వెల్ రేంజ్‌లో 'ఆదిపురుష్':
కొన్నాళ్ల క్రితం రామాయణం ఆధారంగా తీసిన జపనీస్ యానిమేషన్ ఫిల్మ్ చూశానని.. మన పురాణాల గురించి తెలియని ఎవరో అలాంటి సినిమా తీసినప్పుడు మనమెందుకు తీయకూడదనే ఆలోచనతో 'ఆదిపురుష్'ని తెరకెక్కించినట్లు చెప్పారు ఓం రౌత్. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నేటి జెనరేషన్ కి అర్ధమయ్యేలా తీయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. రామాయణాన్ని చాలా కోణాల్లో తెలుసుకున్నానని.. అయితే ఈ జెనరేషన్ వారికి మార్వెల్స్, హ్యారీ పోటర్ వంటి సినిమాలు బాగా కనెక్ట్ అవుతుండడంతో.. అది దృష్టిలో పెట్టుకొని 'ఆదిపురుష్' తీసినట్లు చెప్పారు. రామాయణాన్ని వక్రీకరించి ఈ సినిమా తీయలేదని.. మోడర్న్ పెర్స్పెక్టివ్ లో సినిమా తీశానని అన్నారు.

హాలీవుడ్ లో 'ఆదిపురుష్':
ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాతలు వెల్లడించారు. దీనికోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా 'ఆదిపురుష్' రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

Also Read: బాలయ్య వర్సెస్ చిరు - అల్టిమేటం జారీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు?

Published at : 28 Oct 2022 04:15 PM (IST) Tags: Adipurush Prabhas Om Raut Adipurush run time

సంబంధిత కథనాలు

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Sundar Pichai: ప్రపంచంలో ఏ మూలకెళ్లినా నేను భారతీయుడినే - పద్మ భూషణ్‌ స్వీకరించిన సుందర్‌ పిచాయ్‌

Sundar Pichai: ప్రపంచంలో ఏ మూలకెళ్లినా నేను భారతీయుడినే - పద్మ భూషణ్‌ స్వీకరించిన సుందర్‌ పిచాయ్‌