Shobitha Dhulipala: సమంత గురించి శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు, నాగచైతన్య అలా ఉంటాడట!
గత కొంతకాలంగా నాగ చైతన్య, శోభిత ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలు నిజం అయ్యాయి. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ నేపథ్యంలో సమంత గురించి శోభిత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Shobitha Dhulipala About Samantha: సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య తెలుగమ్మాయి శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపించాయి. ఇద్దరూ కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేసిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, ఈ వార్తలపై అటు శోభిత, ఇటు నాగ చైతన్య స్పందించలేదు. తాజాగా సినీ అభిమానులకు నాగ చైతన్య సర్ ప్రైజ్ ఇచ్చారు. కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ, ఆమెతో వివాహ బంధంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యారు. ఎలాంటి హడావిడి లేకుండా నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగష్టు 8న ఉదయం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ విషయాన్ని నాగ చైతన్య తండ్రి, సీనియర్ నటుడు నాగార్జున అధికారికంగా వెల్లడించారు.
నెట్టింట వైరల్ అవుతున్న శోభిత పాత వీడియో
తాజాగా నాగచైతన్య-శోభితా ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ జరిగిన నేపథ్యంలో.. సమంత గురించి శోభిత గతంలో చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ సమంత గురించి ఆమె ఏం చెప్పిందంటే."సమంత ఫిల్మోగ్రఫీ, కెరీర్ చాలా సూపర్బ్ గా ఉన్నాయి. ఆమె సెలెక్ట్ చేసుకుంటున్న పాత్రలు చాలా అద్భుతంగా ఉంటాయి. అగ్రనటిగా సినిమా పరిశ్రమలో ఆమె కొనసాగుతోంది." అంటూ చెప్పుకొచ్చింది. అదే ఇంటర్వ్యూలో నాగ చైతన్య గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "నాగ చైతన్య చాలా కూల్ గా ఉంటారు. కామ్ గా ఉంటారు. డిగ్నీఫైడ్ గా ఉంటాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
#ShobithaDhulipala About #NagaChaitanya and #Samantha 😳😳😳🔥🔥🔥
— GetsCinema (@GetsCinema) August 8, 2024
https://t.co/oQlrklpx4v
2021లో సమంత, నాగ చైతన్య విడాకులు
‘ఏమాయ చేశావే’ సినిమాలో కలిసి నటించిన నాగ చైతన్య, సమంత స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి అట్టహాసంగా జరిగింది. సుమారు నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. 2021 అక్టోబర్ లో విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని సమంత, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరు సఫరేట్ గా ఉంటున్నారు. ఎవరి కెరీర్ పై వాళ్లు ఫోకస్ పెట్టారు. అటు సమంతతో విడాకుల తర్వాత శోభితతో నాగ చైతన్య ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. చివరకు అవి నిజం అయ్యాయి.
సినిమాల్లో సమంత, నాగ చైతన్య బిజీ
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత త్వరలో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన ఈ పాత్రను.. ఇండియన్ వెర్షన్ లో సమంత పోషిస్తోంది. ‘సిటాడెల్ హనీ బన్నీ’ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఓ బాలీవుడ్ మూవీతో పాటు తమిళ, మలయాళం మూవీస్ లో నటిస్తున్నది. అటు నాగ చైతన్య ‘తండేల్’ అనే సినిమాలో నటిస్తున్నారు.
Read Also: నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితంపై వేణు స్వామి సంచలన కామెంట్స్ - మూడేళ్ల తర్వాత...