News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

FIR Against Shilpa-Raj Kundra: మరో వివాదంలో శిల్పాశెట్టి దంపతులు.. చీటింగ్ కేసు నమోదు

శిల్పాశెట్టి, తన భర్త రాజ్‌కుంద్రాపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యాపారవేత్త ఈ కేసు పెట్టారు.

FOLLOW US: 
Share:

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్​కుంద్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా వారిపై చీటింగ్​ కేసు నమోదైనట్లు సమాచారం. ముంబయికి చెందిన నితిన్​ బరాయ్​ అనే వ్యాపారవేత్త వీరిద్దరితో పాటు మరికొంతమందిపై ఈ కేసు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవే ఆరోపణలు..

శిల్పాశెట్టి, రాజ్​కుంద్రా ప్రారంభించిన ఫిట్​నెస్​ ఎంటర్​ప్రైజెస్​ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా తన దగ్గర నుంచి రూ.కోటి 51 లక్షలు తీసుకున్నారని తిరిగి ఇవ్వాలని అడిగితే తనను బెదరిస్తున్నారని ఆ వ్యాపారవేత్త ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇటీవలే బెయిల్..

పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ అయిన హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ముంబయి కోర్టు ఇటీవల బెయిల్‌ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుపై రాజ్‌కుంద్రాకు బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్‌కుంద్రాతో పాటు మరో నిందితుడు ర్యాన్ తోర్పేకు కూడా బెయిల్ మంజూరైంది. అశ్లీల చిత్రాల కేసులో జులై 19 నుంచి రాజ్‌కుంద్రా కస్టడీలో ఉన్నారు. 

పోర్న్ సినిమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తూ వాటిని కొన్ని మొబైల్ యాప్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లుగా రాజ్‌కుంద్రాపై అభియోగాలు వచ్చాయి. ఈ ఆరోపణలతో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు.  

బ్రిటన్‌లోని తన సమీప బంధువు ప్రదీప్‌ బక్షితో కలిసి రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల దందాను నిర్వహిస్తున్నట్లు వాట్సప్‌ గ్రూప్‌ చాటింగ్‌, ఈ-మెయిళ్ల ద్వారా వెల్లడైనట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ప్రదీప్‌ బక్షికి బ్రిటన్‌లో కెన్రిన్‌ అనే నిర్మాణ సంస్థ ఉంది.

కుంద్రా బాలీవుడ్‌లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతులు, మోడళ్లను అశ్లీల చిత్రాల్లో నటించేలా ఒప్పిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. వారితో పోర్న్ మూవీస్ తీస్తున్నారని.. ఇందుకోసం ఏజెంట్ల ద్వారా కెన్రిన్ సంస్థ నిధులు సమకూర్చిందని.. చిత్రీకరణ తర్వాత కుంద్రా టీం వీడియోలను కెన్రిన్‌ సంస్థకు ఓ అప్లికేషన్‌ ద్వారా పంపిస్తోందని పోలీసులు చెబుతున్నమాట. భారత చట్టాలను తప్పించుకునేందుకు ఆ వీడియోలను బ్రిటన్‌ నుంచి హాట్‌షాట్స్‌ యాప్‌తో పాటు మరికొన్ని యాప్‌లలోనూ అప్‌లోడ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది..

ఈ పోర్న్ కంటెంట్‌ను చూసేందుకు  ఛార్జీలు వసూలు చేసేవారని.. దీని ద్వారా కుంద్రా కోట్ల రూపాయలు ఆర్జించాడని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఇప్పటివరకూ ఈ కేసులో 11 మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.7.5 కోట్లను సీజ్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు. కుంద్రాపై నేరం రుజువైతే 7 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Also Read: Amit Shah Andhra Visit: 'ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు.. నా కోరిక నేటికి నెరవేరింది'

Also Read: Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి

Also read: ABP-CVoter Survey: యూపీ భాజపాకే.. కానీ 100 సీట్లు హాంఫట్.. పంజాబ్‌లో ఒకటి కూడా కష్టమే!

Also read:  తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?

Also read: గోల్డెన్ అవ‌ర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...

Also read: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Nov 2021 02:18 PM (IST) Tags: Raj Kundra Shilpa Shetty 1.51 crore cheating case FIR Lodged FIR Against Shilpa-Raj Kundra

ఇవి కూడా చూడండి

సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ, పరశురాం మూవీ - టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ, పరశురాం మూవీ - టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

తలపతి ఫ్యాన్స్ కి బిగ్ షాక్ - 'లియో' ఆడియో లాంచ్ రద్దు, కారణం అదేనా?

తలపతి ఫ్యాన్స్ కి బిగ్ షాక్ - 'లియో' ఆడియో లాంచ్ రద్దు, కారణం అదేనా?

Naga Vamsi MAD Movie : 'జాతి రత్నాలు' కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ - నిర్మాత ఆఫర్

Naga Vamsi MAD Movie : 'జాతి రత్నాలు' కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ - నిర్మాత ఆఫర్

Muttiah Muralitharan : '800' దర్శకుడికి ఓ కండిషన్ పెట్టిన ముత్తయ్య మురళీధరన్

Muttiah Muralitharan : '800' దర్శకుడికి ఓ కండిషన్ పెట్టిన ముత్తయ్య మురళీధరన్

టాప్ స్టోరీస్

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూ‌ల్‌లో స్వల్ప మార్పులు

PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూ‌ల్‌లో స్వల్ప మార్పులు

Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?