Shahrukh Khan: సిగరెట్, డ్రగ్స్, డేటింగ్..నేను చేయలేకపోయిన పనులు నా కొడుకు చేయాలి, షారుక్ వీడియో వైరల్
డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ అదుపులో ఉన్నాడు. అయితే గతంలో ఆర్యన్ ని ఉద్దేశించి షారుక్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తథాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు అంటుంటారు. కొన్నిసార్లు చాలామంది నవ్వి వదిలేసినా కొన్ని కొన్నిసార్లు అది నిజమే అనిపిస్తుంది. షారుక్ ఖాన్ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ఎన్సీబీ అదుపులో ఉన్నాడు. ఈ సందర్భంగా గతంలో షారూఖ్ తన కుమారుడి గురించి సరదాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తన కొడుకు మంచి వాడుగా ఉంటే ఇంట్లోంచి తరిమేస్తానని అన్నాడు.ఇంతకీ ఏ సందర్భంలో షారుక్ ఇలా మాట్లాడాడంటే... గతంలో తన భార్య గౌరీ ఖాన్‌తో కలిసి 'సిమి గ్రెవాల్' షోకి వెళ్లాడు. ఈ సమయంలో, షారుఖ్ తన యవ్వనంలో చేయలేని చెడు పనులన్నీ తన కొడుకు చేయాల్సిందేనని సరదాగా చెప్పాడు. ‘నా కొడుకు అమ్మాయిలతో డేటింగ్ చేయాలని, సెక్స్, డ్రగ్స్‌ని ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను. మంచి అబ్బాయిలా కనిపించడం మొదలుపెడితే నేను ఇంటి నుంచి తరిమేస్తాను' అన్నాడు. అప్పుడేదో సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Seriously Shahrukh Khan!! @narcoticsbureau
— Priya Kulkarni (@priyaakulkarni2) October 3, 2021
Today he has been arrested pic.twitter.com/1WfZkNkvSC
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబై తీరంలోని కార్డెలియా క్రూయిజ్ లో జరిగిన రేవ్ పార్టీ బాలీవుడ్ బాద్ షా వారసుడిని చిక్కుల్లో పడేసింది. నౌకలో రేవ్ పార్టీ జరుగుతున్న సమయంలో ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించి... కొకైన్, గంజాయి, ఎండీఎంఏ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మొత్తం ఎనిమిది మందిని ఎన్‌సీబీ అదుపులోకి తీసుకుంది. వారిలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమిచ, నూపుర్ సారిక, ఇష్మీత్ సింగ్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, మోహ్క్ జస్వాల్‌ని ఎన్‌సిబి విచారించింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఎన్‌సీబీ కార్యాలయంలో వైద్యపరీక్షలు నిర్వహించిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆర్యన్ ఖాన్‌తో సహా ముగ్గుర్ని ఒక రోజు ఎన్‌సీబీ కస్టడీలోకి తీసుకోవటానికి అనుమతిచ్చింది.
షారుఖ్ ఖాన్-గౌరీ ఖాన్‌ల పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ . మీడియాకు ఎక్కువగా ఆర్యన్ ఫోకస్ కాకుండా షారుఖ్ జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్యన్ వయసు 23 సంవత్సరాలు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా కనిపించకపోయినా.. ఆర్యన్ ఖాన్ కు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్యన్‌ను 14 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
Also Read: ఎవరీ ఆర్యన్ ఖాన్.. మార్షల్ ఆర్ట్స్ నుంచి డ్రగ్స్ కేసు వరకు.. స్టార్ కిడ్ ఆసక్తికర విషయాలు
Also Read: ఆర్యన్ ఖాన్ అరెస్ట్.. షారుఖ్ ఇంటికి చేరుకున్న సల్మాన్ ఖాన్..
Also Read: నటరాజ్ మాస్టర్ ఔట్.. ఫైనల్ గా గుంటనక్క ఎవరో చెప్పేశాడు..
Also Read: లోకల్, నాన్ లోకల్ కామెంట్స్ పై సీనియర్ హీరో రియాక్షన్..