అన్వేషించండి
Advertisement
Pather Panchali: హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా - టాప్ ప్లేస్‌లో 'పథేర్ పాంచాలి'!
ఇండియన్ సినిమా హిస్టరీలో బెస్ట్ ఫిలిమ్స్ పై పోల్ నిర్వహించి.. టాప్ 10లో ఉన్న సినిమాలేవో వెల్లడించింది FIPRESCI.
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ (FIPRESCI) ఇండియా చాప్టర్ ఒక పోల్ ను కండక్ట్ చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో బెస్ట్ ఫిలిమ్స్ పై పోల్ నిర్వహించి.. టాప్ 10లో ఉన్న సినిమాలేవో వెల్లడించింది. ఈ లిస్ట్ లో సత్యజిత్ రే రూపొందించిన 'పథేర్ పాంచాలి'(Pather Panchali ) అనే సినిమా టాప్ ప్లేస్ లో ఉంది. 1929లో ప్రచురించిన బెంగాలీ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాతోనే 1955లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు సత్యజిత్ రే. ఈ సినిమాను సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్ లో రూపొందించారు. ఈ సినిమాకి క్రిస్టోఫర్ నోలన్, మార్టిన్ స్కోర్సెస్, వెస్ ఆండర్సన్ వంటి ఫ్యాన్స్ ఉన్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో హ్యుమానిటీ, పోవెర్టీ వంటి అంశాలను చూపించారు. ఒక ఫ్యామిలీ ఎదుర్కొన్న పరిస్థితులను అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాలో చూపించారు.
A list of the All Time Ten Best Indian Films, from a poll by FIPRESCI-India (India chapter of the International Federation of Film Critics: FIPRESCI) pic.twitter.com/at4KtvaiGX
— Baradwaj Rangan (@baradwajrangan) October 20, 2022
ఈ సినిమా తరువాత 1960లో విడుదలైన 'మేఘే దాకా తార' అనే సినిమా రెండో స్థానాల్లో నిలిచింది. రిత్విక్ ఘటక్ ఈ సినిమాను రూపొందించారు. మూడో స్థానంలో మృణాల్ సేన్ తెరకెక్కించిన 'భువన్ షోమ్' అనే సినిమా నిలిచింది. 1969లో ఇది రిలీజయింది. ఆ తరువాత స్థానాల్లో అదూర్ గోపాలకృష్ణన్ రూపొందించిన మలయాళ సినిమా 'ఎలిప్పతయం', గిరీష్ కాసరవల్లి తెరకెక్కించిన 'ఘటశ్రాద్ధ' వంటి సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ సినిమా 'షోలే' టాప్ 10 ప్లేస్ దక్కించుకుంది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
సినిమా
టెక్
వరంగల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement