Sarkaru Vaari Paata Movie Update: కీర్తీ సురేష్ భుజం మీద వాలిన మహేష్! 'సర్కారు వారి పాట' కొత్త పోస్టర్ చూశావా?
మహేష్ బాబు, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫస్ట్ సాంగ్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ రోజు కొత్త పోస్టర్ విడుదల చేశారు. దాన్ని చూశారా?
'సర్కారు వారి పాట'... సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తీ సురేష్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా. వీళ్లిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందనే సందేహాలకు బర్త్ డే బ్లాస్టర్ సమాధానం ఇచ్చింది. ఆల్రెడీ విడుదలైన ఆ టీజర్‌లో 'సార్ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్టి తీయడం మర్చిపోకండి' అని కీర్తీ సురేష్ చెప్పడం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ నెల 14న... ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సినిమాలో తొలి పాట 'కళావతి...' విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ - కీర్తీ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. కీర్తీ సురేష్ భుజాల మీద మహేష్ వాలిన ఆ పోస్టర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
మహేష్ బాబు - తమన్ కాంబినేషన్‌లో 'దూకుడు', 'బిజినెస్ మేన్', 'ఆగడు' వచ్చాయి. ఆయా సినిమాల్లో పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అప్పటితో పోలిస్తే... ఇప్పుడు తమన్ మరింత ఫామ్‌లో ఉన్నాడు. అందుకని, ఎటువంటి మ్యూజిక్ ఇస్తాడోనని మహేష్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకని, 'కళావతి' సాంగ్ మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మే 12న థియేటర్లలో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి మహేష్ బాబు చేస్తున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అందులో పూజా హెగ్డే కథానాయిక. ఆ లోపు 'సర్కారు వారి పాట' షూటింగ్ కంప్లీట్ కానుంది.
View this post on Instagram