సంక్రాంతి సమరంలో బడా స్టార్స్ - ప్రభాస్, చిరంజీవి, బాలయ్యతో పోటీకి సిద్ధమైన అఖిల్, విజయ్!
సంక్రాంతి వస్తుందంటే చాలు టాలీవుడ్ లో పెద్ద సినిమాలు సందడి మొదలవుతుంది. సంక్రాంతే లక్ష్యంగా తెలుగులో పెద్ద సినిమాలు విడుదల అవుతాయి. ఈసారి సంక్రాంతికి తెలుగులో విడుదలయ్యే సినిమాల లిస్ట్ పెద్దదే ఉంది.
సంక్రాంతి వస్తుందంటే చాలు టాలీవుడ్ లో పెద్ద సినిమాలు సందడి మొదలవుతుంది. సంక్రాంతే లక్ష్యంగా తెలుగులో పెద్ద సినిమాలు విడుదల అవుతాయి. ఈసారి సంక్రాంతికి తెలుగులో విడుదలయ్యే సినిమాల లిస్ట్ పెద్దదే ఉంది. భారీ బడ్జెట్ సినిమాల తో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', నందమూరి బాలకృష్ణ సినిమా ‘వీరసింహారెడ్డి’ కూడా సంక్రాంతికే విడుదల చేయాలని చూస్తున్నారు. మరోవైపు ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా విడుదల తేదీని ప్రకటించేసింది మూవీ టీమ్. అయితే ఇప్పుడు సంక్రాంతి బరిలో కి మరో రెండు భారీ సినిమాలు కూడా పోటీ పడనున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉండి కూడా సరైన హిట్ లేని హీరోలు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో అక్కినేని అఖిల్ ఒకడు. అఖిల్ తాజాగా నటిస్తోన్న సినిమా 'ఏజెంట్'. ఈ సినిమా పై అక్కినేని అఖిల్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం సినిమా విడుదల కు రంగం సిద్ధమైంది. ఈ సినిమా విడుదలపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కొన్ని కారణాల వలన సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. అఖిల్ సినీ ఇండస్ట్రీలో కి వచ్చి చాలా ఏళ్ళు అవుతోంది. అయితే ఇప్పటివరకు అఖిల్‌కు సరైన హిట్ రాలేదు. అంతక ముందు వచ్చిన సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి. దీంతో 'ఏజెంట్' సినిమాపై చాలానే అంచనాలు పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అఖిల్ కు జంటగా సాక్షి వైద్య కనిపించనుంది. కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. మమ్ముట్టి కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో ఏజెంట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్.
Get caught upon all the ACTION 😎#Agent Arriving in theatres WorldWide this SANKRANTHI 2023 🔥 #HappyDiwali
— AK Entertainments (@AKentsOfficial) October 24, 2022
ఏజెంట్・एजेंट・ஏஜென்ட்・ഏജന്റ്・ಏಜೆಂಟ್@AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @hiphoptamizha @AnilSunkara1 @S2C_Offl @LahariMusic @GTelefilms pic.twitter.com/AsKXt0BqrW
తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల హీరోలు కూడా ఈసారి సంక్రాంతి కి బరిలో దిగనున్నారు. తెలుగు మార్కెట్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ కూడా తన సినిమాను సంక్రాంతి విడుదల చేయనున్నారు. విజయ్ హీరోగా నటిస్తున్న 'వారసుడు' సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. ఆయన సినిమాలు తెలుగులో కూడా బాగా ఆదరణ పొందుతున్నాయి. దీంతో విజయ్ నటిస్తోన్న సినిమాను సంక్రాంతికి బరిలో దించనున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు పోస్టర్ ను విడుదల చేసింది. అయితే రిలీజ్ డేట్ ఇవ్వలేదు. ఈ పోస్టర్ లో విజయ్ మాస్ లుక్ తో కనిపిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.
మీకూ మీ కుటుంబసభ్యులు అందరికీ దీపావళి శుభకాంక్షలు 🧨
— Sri Venkateswara Creations (@SVC_official) October 24, 2022
Let’s celebrate #Vaarasudu #Varisu in theaters for Sankranthi 2023 🔥#VarisuPongal#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @KarthikPalanidp @Cinemainmygenes @scolourpencils @vaishnavi141081 pic.twitter.com/va1NHcbBmN
ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాను సంక్రాంతి కి కానుకగా విడుదల చేయున్నట్లు టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ప్యాన్ ఇండియా సినిమా గా తొలిసారి రాముడి పాత్ర పోషిస్తున్న ప్రభాస్ ను చూసేందుకు ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీజర్ కు మిక్స్డ్ టాక్ వచ్చినా సినిమా బజ్ కు అదే మాత్రం ఆటంకం కాదు. అయోధ్య రామమందిరానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా అదే రోజు జరుగుతుందని, ఆ రోజునే దేశవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా విడుదలవుతుందని ప్రచారం జరుగుతోంది.
సంక్రాంతి బరిలో ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ వచ్చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న Mega 154 కు వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కేఎస్ రవీంద్ర(బాబి) డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు టీమ్ ప్రకటించింది. మెగాస్టార్.. ముఠామేస్త్రీ నాటి స్వాగ్ తో కనిపించారు టీజర్‌లో. ఇక బాలకృష్ణ NBK 107తో గోపిచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు వీరసింహారెడ్డి అని టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగానే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వీరసింహారెడ్డి టీజర్‌లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగులతో హోరెత్తించారు.