Sameera Reddy: నేను కూడా ఆ వ్యాధితో బాధపడ్డా - నటి సమీరా రెడ్డి వ్యాఖ్యలు
విల్ స్మిత్ భార్యను బాధించిన అలోపేసియా ఏరియాటా వ్యాధి గురించి చెప్పుకొచ్చింది నటి సమీరా రెడ్డి.
ఇటీవల ఆస్కార్ అవార్డు కార్యక్రమంలో కమెడియన్ క్రిస్ రాజ్ స్టేజ్ పై మాట్లాడుతూ.. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భార్యపై కామెడీ చేశాడు. దీంతో విల్ స్మిత్ అతడి చెంప చెళ్లుమనిపించాడు. ఈ సంఘటనపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ.. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్ బ్రాండ్ కంగనా ఈ విషయంపై మాట్లాడుతూ.. విల్ స్మిత్ కి సపోర్ట్ గా నిలిచింది. తాజాగా నటి సమీరా రెడ్డి కూడా ఈ విషయంపై మాట్లాడింది.
స్మిత్ భార్యను బాధించిన అలోపేసియా ఏరియాటా వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. తను కూడా గతంలో ఇదే వ్యాధితో బాధపడినట్లు తెలిపింది. అంతేకాదు.. ఈ వ్యాధి అంటే ఏంటో కూడా సమీరా వివరించింది. ప్రతి ఒక్కరు జీవితంలో వ్యాకత్తిగతంగా కొన్ని సమస్యలతో బాధపడుతుంటారని.. ఇటీవల చోటుచేసుకున్న ఆస్కార్ వివాదం తనను ఈ విషయంపై మాట్లాడేలా చేసిందని తెలిపింది.
అలోపేసియా అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి అని.. దీని వలన జుట్టు కుదుళ్ల నుంచి ప్యాచ్ లుగా ఓడిపోతుందని.. 2016లో తను కూడా ఈ వ్యాధితో బాధపడినట్లు చెప్పింది. ఒకరోజు తన తల వెనుక భాగంగా రెండు ఇంచుల మేర జుట్టు ఊడిపోయి ఉండడంతో తన భర్త అక్షయ్ గమనించాడని చెప్పింది. ఒక నెలలోనే రెండు, మూడు చోట్ల జుట్టు ఊడిపోయి కనిపించిందని.. ఇది అంటు వ్యాధి కాదని చెప్పింది. కానీ జుట్టు రాలిపోవడమంటే మానసికంగా కుంగదీస్తుంది.. ఈ వ్యాధి ఎందుకు వస్తుందనే దానికి కచ్చితమైన కారణం తెలియదని చెప్పుకొచ్చింది.
తను ఈ సమస్య నుంచి బయటపడ్డానని.. ప్రస్తుతం తన తలలో ఎలాంటి ప్యాచ్ లు లేవని తెలిపింది. తెలుగులో ఈ బ్యూటీ 'జై చిరంజీవ', 'అశోక్' వంటి చిత్రాల్లో హీరోయిన్ గా కనిపించింది. ఆ తరువాత అక్షయ్ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.
Also Read: ఎన్టీఆర్ 8 కిలోల టార్గెట్, కొత్త లుక్ కోసం స్పెషల్ వర్కవుట్
View this post on Instagram