By: ABP Desam | Updated at : 22 Dec 2022 04:28 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Samanthaprabhu2/twitter
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతా గత కొద్ది కాలంగా మైయోసిటిస్(Myositis)తో బాధపడుతోంది. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ విరామంలో ఉంది. దీంతో ఆమె ఇప్పటికే అంగీకరించిన సినిమాల గురించి పలు ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ కు సంబంధించిన పలు సినిమాలను ఆమె హోల్డ్ లో పెట్టారని, మరికొన్ని సినిమాలను వదులుకున్నారని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై సమంత అధికార ప్రతినిధి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఆమె సినిమాలు ఏవీ హోల్డ్ లో లేవని స్పష్టం చేశారు.
“సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. సంక్రాంతి తర్వాత ‘కుషి’ షూటింగ్‌లో ఆమె పాల్గొనబోతోంది. ఆ తర్వాత తన బాలీవుడ్ ప్రాజెక్ట్ లో కొనసాగుతుంది. జనవరి నుంచి హిందీ సినిమాకు డేట్స్ ఇచ్చాం. కానీ, అనుకోని కారణాల వల్ల సినిమాల షూటింగ్‌లు దాదాపు ఆరు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆమె ఏప్రిల్ లేదా మే నుంచి హిందీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది. ముందుగా అనుకున్న ప్రకారం, జనవరిలో సమంత బాలీవుడ్ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. దానికి అనుగుణంగా డేట్స్ కూడా కేటాయించారు. సినిమా నిర్మాణంలో చాలా శ్రమ ఉంటుంది. ఎవరినైనా ఎక్కువసేపు వెయిట్ చేయించడం మంచిది కాదు. వెయిట్ చేయడం సాధ్యం కాకపోతే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగాలని మొదటి నుంచి మేకర్స్‌కి క్లారిటీ ఇస్తున్నాం. సమంత అధికారికంగా అంగీకరించిన ఏ ప్రాజెక్ట్ ను కూడా ఇప్పటి వరకు వదులుకోలేదు. రాబోయే ప్రాజెక్ట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు" అని తేల్చి చెప్పారు. అటు సమంతా ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని చెప్పారు. అభిమానులు సోషల్ మీడియా వేదికగా సమంతా కోలుకోవాలని భగవంతుడికి చేసిన ప్రార్ధనలు నెరవేరాయని చెప్పారు. సమంతా మైయోసిటిస్ చికిత్స కోసం దక్షిణ కొరియాకు వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, సమంత అధికార ప్రతినిధి ఈ విషయానికి సంబంధించి ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు.
మైయోసిటిస్ అనేది కండరాలకు సంబంధించిన అంశం. కండరాలపై తీవ్ర ప్రభావం చూపి, మనిషిని కదల్లేకుండా చేస్తుంది. శరీరంలోని కండరాలన్నింటిని బలహీన పర్చుతోంది. కండరాలు వాపుకు గురై నడవలేని స్థితికి చేరే అవకాశం ఉంటుంది. అయితే, సమంతా మరీ ఆ స్థాయికి చేరలేదు. తను ఉన్న స్థితి చాలా మెరుగ్గా ఉందని డాక్టర్లు ఇప్పటికే వెళ్లడించారు. త్వరలో ఈ సమస్య నుంచి బయటపడతానని స్వయంగా సమంతా కూడా వెల్లడించింది.
ఇక సమంతా సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ కలిసి ‘ఖుషి’ అనే రొమాంటిక్ డ్రామాలో కనిపించనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.
Read Also: అరెరే ‘అవతార్-2’ ఎంత పనిచేసింది - జపాన్ థియేటర్లకు ఊహించని దెబ్బ, పాపం ప్రేక్షకులు
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్లో సంజయ్ దత్, హీరోయిన్గా త్రిష
Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్
Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్
Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌గా భారతి హోళికేరి