News
News
వీడియోలు ఆటలు
X

Citadel Premiere: లండన్‌కు చెక్కేసిన సమంత - ‘శాకుంతలం’ షాక్ నుంచి కోలుకున్నట్లే!

ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో లండన్ లో ప్రీమియర్ షో వేశారు. దీనికి సమంత,వరుణ్ ధావన్ హాజరయ్యారు.

FOLLOW US: 
Share:

హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ను, అమెజాన్ సంస్థ గ్రాండ్ గా రూపొందిస్తోంది. ‘సిటాడెల్‌’లో ప్రియాంక ఎలైట్ గూఢచారి నదియా సిన్ పాత్ర పోషిస్తుంది. ఏప్రిల్ 28న ‘సిటాడెల్’ సిరీస్ స్ట్రీమింగ్ కు రానున్నది. రస్సో బ్రదర్స్ సృష్టించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా  ‘సిటాడెల్‘ సిరీస్ ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది. ఇప్పటికే  వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. 

సిటాడెల్’ ప్రీమియర్ షోక్ హాజరైన ఇండియన్ ‘సిటాడెల్’ టీమ్

తాజాగా ‘సిటాడెల్‘ ప్రీమియర్ షోను లండన్ లో వేశారు. ఈ షోకు ఇండియన్ వెర్షన్ నటీటనలు, దర్శకులు సమంత, వరుణ్ ధావన్,  రాజ్, డీకే హాజరయ్యారు. ప్రియాంక చోప్రాతో కలిసి సమంతా ఈ షో తిలకించారు. వరుణ్ బ్లాక్ సీ-త్రూ టీ-షర్ట్, మ్యాచింగ్ డెనిమ్‌, షూ, జాకెట్‌ను ధరించగా, సమంత స్టేట్‌మెంట్ నెక్‌పీస్,  బ్రాస్‌ లెట్‌ తో కూడిన బ్లాక్ కో-ఆర్డ్ సెట్‌లో ఉంది. ఈ కార్యక్రమంలో రాజ్, డీకేతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రియాంక ఆఫ్-షోల్డర్ రెడ్ గౌనులో అందంగా కనిపించారు. నటుడు రిచర్డ్ మాడెన్ బ్లాక్ సూట్‌ వేసుకున్నారు. ప్రియాంక భర్త నిక్ జోనా, ఆమె తల్లి డాక్టర్ మధు చోప్రా కూడా ఈ ప్రీమియర్‌కు హాజరయ్యారు.

View this post on Instagram
 
A post shared by VarunDhawan (@varundvn)

ఏప్రిల్ 28 నుంచి ‘సిటాడెల్’ సిరీస్ స్ట్రీమింగ్

ఏప్రిల్ 28న ‘సిటాడెల్’ సిరీస్ కు సంబంధించిన రెండు ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ కు రానున్నది.  దాని తర్వాత ప్రతి శుక్రవారం మే 26 వరకు వారానికో కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన  ట్రైలర్ ను తెలుగుతో పాటు హిందీ, తమిళం,  కన్నడ, మలయాళంలోనూ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం హై యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. ‘సిటాడెల్’ స్పై ఏజెంట్లుగా ప్రియాంక, మాడన్ సూపర్ డూపర్ యాక్షన్ తో అదరగొట్టారు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సైతం ఆకట్టుకున్నాయి. గన్స్, బాంబ్స్ మోతలతో భారీ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ నిండిపోయింది. ట్రైలర్ స్టార్టింగ్ మొదలుకుని చివరి వరకు కన్ను ఆర్పకుండా చూసేలా ఉంది.

ఇదే ‘సిటాడెల్’ సిరీస్ బాలీవుడ్ లోనూ తెరకెక్కుతోంది. ఇక్కడి ప్రేక్షకులకు అనుకూలంగా  స్క్రిప్ట్ ని మార్చి దర్శకులు రాజ్, డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన సమంతను ’సిటాడెల్’ ఇండియన్ వర్షన్ మెయిన్ లీడ్ గా తీసుకున్నారు. వరుణ్ ధావన్ సైతం ఇందులో మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. సమంత చేసే ఈ సిరీస్ పై కూడా ఇండియాలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్ కూడా షూటింగ్ జరపుకుంటోంది. తాజాగా  ఈ సిరీస్ గురించి సమంతా మీడియాతో మాట్లాడింది. “ది ఫ్యామిలీ మ్యాన్‌లో పనిచేసిన రాజ్, డీకేతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని వెల్లడించింది. ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు ఉన్నా, సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ నాతో ఓపికగా, దయతో వ్యవహరిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు” అని వివరించింది.

Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?

Published at : 19 Apr 2023 12:26 PM (IST) Tags: Priyanka Chopra Varun Dhawan Samantha Citadel Web Series Citadel London premiere

సంబంధిత కథనాలు

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Samantha Gown Worth : సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!

Samantha Gown Worth : సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !