Samantha: అమ్మా.. నువ్వే అండగా నిలవాలి, దేవీ నవరాత్రి వేడుకల్లో సమంత ప్రత్యేక పూజలు
నటి సమంత.. దేవీ నవరాత్రుల వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసింది. ఎరుపు వర్ణం దుస్తులు ధరించి అమ్మవారి సేవలో పాల్గొన్నది. కష్ట సమయంలో అండగా నిలవాలంటూ అమ్మవారిని వేడుకుంది.
Actress SamanthaPooja: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, వ్యక్తిగతంగా అనేక సమస్యలున్నాయి. శారీరకంగా, మానసికంగా ఎన్నో కష్టాలు పడుతోంది. తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆమెకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు సమంత దుర్గా నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నది. దేశ వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో... సమంత అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్నది. దేవికి ప్రత్యేక పూజలు చేసింది. ఎరుపు రంగు దుస్తుల్లో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నమస్కరించింది. ఈషా ఫౌండేషన్ కు చెందిన లింగ భైరవి ఆలయాన్ని సందర్శించిన సమంత.. చాలా సేపు దుర్గామాత చెంతనే గడిపింది. మానసిక, శారీరక సమస్యల నుంచి బయటపడేయాలంటూ అమ్మవారిని వేడుకున్నది.
View this post on Instagram
కెరీర్లో నో టెన్షన్.. పర్సనల్గా ఫుల్ టెన్షన్స్
తెలుగు, తమిళంతోపాటు హిందీ చిత్రపరిశ్రమలోనూ అద్భుతంగా రాణిస్తున్న సమంత వ్యక్తిగతంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నది. ఎంతో ఇష్టపడి చేసుకున్న ప్రేమ వివాహం కొంత కాలానికే ముగిసిపోయింది. వైవాహిక జీవితంలో అష్టకష్టాలు పడింది. ఎంతో మానసిక క్షోభకు గురయ్యింది. చివరకు విడాకులు తీసుకుని ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగించే ప్రయత్నంలో మరో ఎదురు దెబ్బ తగిలించింది. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ వ్యాధికి గురయ్యింది. ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఓవైపు ఆధునిక వైద్యం తీసుకుంటూనే, మరోవైపు ప్రకృతి వైద్యం చేయించుకుంది. ప్రర్యాటక ప్రదేశాల్లో తిరుగుతూ, ప్రకృతి నడుమ గడుపుతూ మానసిక ప్రశాంత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ఏకంగా కొంతకాలం పాటు సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పుడిప్పుడే సమస్య నుంచి బయటపడుతోంది.
కొండా సురేఖ వ్యాఖ్యలతో మళ్లీ మానసిక ఆవేదన
ప్రస్తుతం అంతా సెట్ అవుతోంది అనుకున్న సమయంలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు మరోసారి సమంతకు మానసిక సమస్యలను తెచ్చిపెట్టాయి. మాజీ మంత్రి కేటీఆర్ పై ఆమె తీవ్ర విమర్శలు చేసే సమయంలో సమంత విడాకుల వ్యవహారాన్ని ప్రస్తావించింది. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తన గురించి అసభ్యకర రీతిలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. కేటీఆర్ విషయంలో తనను బద్నాం చేయడం మంచిది కాదని హితవు పలికింది. “నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడ్డం మానుకోవాలి. స్త్రీగా ఉండేందుకు, బయటకు వచ్చి పొరాడేందుకు చాలా ధైర్యం కావాలి. ఈ ప్రయాణం తనను పూర్తిగా మార్చినందుకు గర్వంగా ఉంది. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి. తన విడాకుల వ్యవహారం వ్యక్తిగత విషయం. దానికి గురించి ఊహాగానాలు చేయకూడదని కొండా సురేఖను అభ్యర్థిస్తున్నా” అని చెప్పుకొచ్చింది.
Read Also: క్షమించే ప్రసక్తే లేదు.. బుద్ది చెప్పాల్సిందే, కొండా వ్యాఖ్యలపై అక్కినేని అఖిల్ తీవ్ర ఆగ్రహం