Citadel Honey Bunny On Prime ఈవెంట్లో వరుణ్ ధావన్ సమంత గురించి ఓ సీక్రెట్ చెప్పాడు. సమంత యాక్షన్ సన్నివేశాలు చేశాక.. ఏమి చేస్తాదో తెలుసుకుని షాక్ అయినట్లు తెలిపాడు. తనని ఇన్స్ప్రెషన్గా తీసుకుని ఆ పని తాను చేసినా సక్సెస్ కాలేకపోయానని తెలిపాడు. ఇంతకీ సమంత యాక్షన్ సన్నివేశాల తర్వాత ఏమి చేస్తుంది. ధావన్ షాకైన విషయమేమిటో వరుణ్ మాటల్లోనే.. ఇకపై ఇది ఏ మాత్రం ఛాలెంజ్ కాదు. సమంత అందరికంటే బాగా చేస్తుందని తెలిపాడు. (Video Source : totalfilmii) సమంత యాక్షన్ సినిమాల తర్వాత ఐస్ బాత్ చేస్తుందట. అది కూడా ఒకటీ, రెండూ నిమిషాలు కాదు. దాదాపు పది నిమిషాలు చేస్తుందని వరుణ్ చెప్తుంటే.. అంత సేపు చేయనంటూ సమంత నవ్వేసింది. ఆరు నిమిషాలు ఐస్ బాత్ చేస్తానని.. ఇది చేయడం వల్ల తనకి బాడీ పెయిన్స్, ఒత్తిడి తగ్గుతాయని తెలిపింది. సమంతలాగా తాను చేయాలనుకున్నా కానీ నేను రెండు నిమిషాలే ఐస్ బాత్ చేయగలిగానని వరుణ్ తెలిపాడు. వరుణ్, సమంత కలిసి నటించిన యాక్షన్ సిరిసీ నవంబర్‌లో ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. (Images Source : Instagram)