మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో ఊపిరితీత్తులు ఒకటి.

ఊపిరితీత్తులు ఆరోగ్యంగా ఉంటేనే మన జీవితం సాఫీగా సాగుతుంది.

మీ ఊపిరి కలకాలం నిలవాలంటే తప్పకుండా కొన్ని అలవాట్లు అలవరుచుకోవాలి.

స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. స్మోక్ చేసేవారికి దూరంగా ఉండండి.

లేకపోతే.. ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(COPD)కి గురయ్యే ప్రమాదం ఉంది.

మీ ఇంట్లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. మూసేసినట్లుగా ఉండకూడదు.

వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, యోగా వంటివి కూడా ఊపిరితీత్తులకు మేలు చేస్తాయి.

రోగనిరోధక శక్తికి ఉపయోగపడే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోండి.

బెర్రీస్, ఆకుకూరలు వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు కూడా తీసుకోండి.

నీరు బాగా తాగండి. డాక్టర్ సూచనలతో ఫ్లూ వ్యాక్సిన్, న్యుమోనియా వ్యాక్సిన్ వంటి టీకాలు తీసుకోండి.

బరువు పెరగకుండా జాగ్రత్తపడండి. అధిక బరువు కూడా ఊపిరితీత్తులపై ప్రభావం చూపుతుంది.