అన్వేషించండి

Akhil Akkineni : క్షమించే ప్రసక్తే లేదు.. బుద్ది చెప్పాల్సిందే, కొండా వ్యాఖ్యలపై అక్కినేని అఖిల్ తీవ్ర ఆగ్రహం

Konda Surekha Issue : అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అఖిల్, న్యాయపరంగా ఆమెకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

Akhil Akkineni On Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం సృష్టించాయి. రాష్ట్ర రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలోనూ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తులు దిగజారి మాట్లాడకూడదని మండిపడ్డారు. వెంటనే అక్కినేని కుబుంబానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి నాగార్జున‌, అమ‌ల‌, నాగ చైత‌న్య‌ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు కొండా సురేఖను వెంటనే మంత్రి పదవిని నుంచి తొలగించాలంటూ అమల ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీని కోరింది.

కొండా సురేఖపై ఫ్యామిలీపై అక్కినేని ఫ్యామిలీ పరువునష్టం దావా

ఇప్పటికే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తాజాగా ఇదే విషయానికి సంబంధించి అక్కినేని నాగార్జున సైతం కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న కొండా సురేఖ తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దిగజార్చేలా దారుణ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులోకేసు ఫైల్ చేశారు.  మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు.   

న్యాయపరంగా బుద్ది చెప్పాలి- అక్కినేని అఖిల్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై అక్కినేని అమ‌ల కొడుకు, యువ నటుడు అఖిల్  సీరియస్ అయ్యారు. అర్థం లేని విష‌యంపై స్పందించాల్సి రావ‌డం ప‌ట్ల విచారం వ్యక్తం చేశాడు. కానీ, కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌డం త‌ప్ప వేరే మార్గం లేదన్నారు. “కొండా సురేఖ చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు, అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ఉన్న ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. ఆమె వ్యాఖ్యలు మా కుటుంబ సభ్యుల గౌరవాన్ని కించపరిచాయి. అగౌరవ పరిచాయి. ఆమె స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం ఎలాంటి సంబంధం లేని తమ కుటుంబాన్ని లాగడం అభ్యతరకరం. ఆమె ఆడిన రాజకీయ క్రీడలో మాలాంటి అమాయకులను బలిపశువులుగా నిలబెట్టారు. బాధిత కుటుంబ సభ్యుడిగా, సినీ నటుడిగా ఈ విషయంపై నేను మౌనంగా ఉండను. ఈ సిగ్గుమాలిన వ్యక్తికి న్యాయపరంగా తగిన బుద్ది చెప్పే ప్రయత్నం చేస్తాం. సమాజంలో ఆమె లాంటి వాళ్లకు ఉండే అర్హత లేదు. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు” అంటూ ట్విట్టర్ వేదికగా తన కోపాన్ని వెల్లగక్కారు. 

ప్రస్తుతం అఖిల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొండా సురేఖ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పినప్పటికీ ఒక కుటుంబంపై వేసి అభాండాలను ప్రజలు ఎలా మర్చిపోతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా ఆమెకు కోర్టు ద్వారా తగిన బుద్ది చెప్పాలని నెటిజన్లు అఖిల్ కు సూచిస్తున్నారు.  

Read Also:మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balakrishna : టెక్నిక్ పెరిగినా సినిమాలు లేట్... థియేటర్స్‌కు తాళాలు - గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రియాక్షన్
టెక్నిక్ పెరిగినా సినిమాలు లేట్... థియేటర్స్‌కు తాళాలు - గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రియాక్షన్
Peddi Item Song : హల్లల్లల్లో ఐటమ్ సాంగ్ సింగర్ ఈమెనే - రక్షిత సురేష్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా!
హల్లల్లల్లో ఐటమ్ సాంగ్ సింగర్ ఈమెనే - రక్షిత సురేష్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా!
Jana Nayagan Release Date : జన నాయగన్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు నోటిఫికేషన్స్... సీఎం బర్త్ డేకు డబుల్ ట్రీట్
జన నాయగన్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు నోటిఫికేషన్స్... సీఎం బర్త్ డేకు డబుల్ ట్రీట్
Allu Arjun : శక్తిమాన్‌గా అల్లు అర్జున్ - మలయాళ స్టార్ డైరెక్టర్‌తో మూవీ... క్లారిటీ వచ్చేసింది
శక్తిమాన్‌గా అల్లు అర్జున్ - మలయాళ స్టార్ డైరెక్టర్‌తో మూవీ... క్లారిటీ వచ్చేసింది

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Tiger Trapped In Cage: నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Embed widget