Samantha: షారుఖ్ తో సినిమా - సమంత వదులుకోవడానికి కారణమిదే!
షారుఖ్ తో అవకాశం అయినప్పటికీ.. బాలీవుడ్ లో గ్రాండ్ లాంఛింగ్ అయినప్పటికీ.. తన ఫస్ట్ చైల్డ్ కోసం ఈ సినిమాకి సమంత నో చెప్పినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి 'జవాన్' అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. రీసెంట్ గా ఈ సినిమాలో షారుఖ్ లుక్ ని రివీల్ చేస్తూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలనుకున్నారట అట్లీ.
ఈ సినిమా ద్వారా సమంతను బాలీవుడ్ లో పరిచయం చేయాలనుకున్నారు. అయితే అప్పట్లో సమంత ఈ సినిమాకి నో చెప్పిందట. 2019లో ఈ సినిమా చేయాలనుకున్నారు. అప్పటికి నాగచైతన్యతో సమంత వివాహబంధంలో ఉంది. తాను ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నట్లుగా.. దీంతో ఈ బాలీవుడ్ సినిమాను ఒప్పుకోలేదని సమాచారం.
షారుఖ్ తో అవకాశం అయినప్పటికీ.. బాలీవుడ్ లో గ్రాండ్ లాంఛింగ్ అయినప్పటికీ.. తన ఫస్ట్ చైల్డ్ కోసం ఈ సినిమాకి సమంత నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అట్లీ కూడా ఆమెని ఒప్పించే ప్రయత్నం చేయలేదట. అయితే కోవిడ్ కారణంగా అట్లీ-షారుఖ్ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. సమంత కూడా విడాకులు తీసుకొని చైతుకి దూరమైంది. ఫైనల్ గా షారుఖ్ సరసన నయనతారను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పుడు సమంత బాలీవుడ్ లో సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేసుకుంటుంది. ఇప్పటికే 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేసింది. సినిమా అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగులో 'యశోద' అనే సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
View this post on Instagram