IIFA 2022 Awards: ఐఫా 2022 వేడుక - అవార్డ్స్ అన్నీ ఆ సినిమాకే!
22వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(IIFA Awards 2022) అవార్డుల ప్రధానోత్సవం జూన్ 4 రాత్రి ముగిసింది.
సినిమా ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాల్లో 'ఐఫా' అవార్డ్స్ ఒకటి. 22వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(IIFA Awards 2022) అవార్డుల ప్రధానోత్సవం జూన్ 4 రాత్రి ముగిసింది. జూన్ 3న అబుదాబిలో ప్రారంభమైన ఈ వేడుక సినీ సెలబ్రిటీల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్, రితేష్ దేశ్ ముఖ్, మనీష్ పాల్ హోస్ట్ గా వ్యవహరించారు. అలానే షాహిద్ కపూర్, నోరా ఫతేహి డ్యూయెట్ సాంగ్ కి పెర్ఫార్మ్ చేశారు.
ఈ వేడుకలో బాలీవుడ్ తారలు మెరిసిపోయారు. హీరోయిన్లంతా చాలా గ్లామరస్ గా కనిపించారు. ఈ ఈవెంట్ లో ఉత్తమ నటీనటులకు, చిత్రాలకు అవార్డులు అందించారు. అందరికంటే ఎక్కువ అవార్డులు 'షేర్షా' సినిమాకి దక్కాయి.
ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందంటే..
బెస్ట్ ఫిలిం : షేర్షా
బెస్ట్ డైరెక్టర్ : విష్ణువర్ధన్ (షేర్షా)
బెస్ట్ యాక్టర్ : విక్కీ కౌశల్ (సర్దార్ ఉద్ధమ్)
బెస్ట్ యాక్ట్రెస్ : కృతి సనన్ (మిమి)
బెస్ట్ యాక్టర్ డెబ్యూ : అహన్ శెట్టి (తడప్ 2)
బెస్ట్ యాక్ట్రెస్ డెబ్యూ : శర్వారీ వాఘ్ (బంటీ ఔర్ బబ్లీ 2)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ మేల్ : పంకజ్ త్రిపాఠీ (లూడో)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఫీమేల్: సయూ తమ్హాంకర్ (మిమి)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (టై): ఏఆర్ రెహమాన్ (ఆత్రంగి రే), తనిష్క్ బగ్చీ, జస్లీన్ రాయల్, జావేద్-మోసిన్, విక్రమ్ మాంత్రోస్, బి ప్రాక్, జానీ (షేర్షా)
బెస్ట్ సింగర్ మేల్: జుబిన్ నటియాల్ (షేర్షా)
బెస్ట్ సింగర్ ఫీమేల్: అసీస్ కౌర్ (షేర్షా)
బెస్ట్ స్టోరీ (ఒరిజినల్): అనురాగ్ బసు (లూడో)
బెస్ట్ స్టోరీ (అడాప్టెడ్): కబీర్ ఖాన్, సంజయ్ పురాన్ సింగ్ చౌహన్ (83)
Also Read: కావాలనే గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తుంటా - నజ్రియా కామెంట్స్
A major win at the #IIFA2022 for #Shershaah as it is presented with the highest number of awards for the event - a total of 6! Overwhelmed and PROUD to have painted this story for the world to watch & shower their unending love… pic.twitter.com/bEhyeJ5teH
— Karan Johar (@karanjohar) June 5, 2022
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram