By: ABP Desam | Updated at : 02 Jun 2023 03:58 PM (IST)
Photo Credit: Samantha/Priyanka/Instagram
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లతోనూ తన సత్తా చాటుతోంది. గతంలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ‘ఫ్యామిలీమెన్’ వెబ్ సిరీస్ లో తన నటనతో ఆకట్టుకున్న సమంత, మరోసారి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ‘సిటాడెల్’ హిందీ వెబ్ సిరీస్ ప్రధానపాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. మరోవైపు ‘సిటాడెల్’ హిందీ వెర్షన్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ‘సిటాడెల్’ ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది.
తాజాగా ఈ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ‘సిటాడెల్’ ఇంగ్లీష్ వెర్షన్ ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు పూర్తయ్యాయి. రీసెంట్ గా ఐదో ఎపిసోడ్ విడుదల తర్వాత ఓ ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ప్రియాంక చోప్రా తన తండ్రిని పిలిచినప్పుడు హీరో వరుణ్ ధావన్ వాయిస్ వినిపించింది. దీంతో పిసీ కు వరుణ్ తండ్రిగా కనిపించనున్నారని అర్థమవుతోంది. ఈ మేరకు సమంత కూడా ప్రియాంకకు తల్లిగా కనిపింస్తుందా? అనే కోణంలో చర్చ జరిగింది. అయితే, అది వాస్తమేనని స్వయంగా సమంతా వెల్లడించింది. గ్లోబల్ వెర్షన్ లో సమంతా, ప్రియాంక చోప్రాకు తల్లిగా నటించింది
‘సిటాడెల్’ ఇంగ్లీష్ వెర్షన్ లో నటిస్తోన్న ప్రియాంక చోప్రాకు వరుణ్ ధావన్ తండ్రి అయితే, హిందీ వెర్షన్ అంతకు ముందే జరిగిన కథలా చూపిస్తారని తెలుస్తోంది. హిందీ వెర్షన్ ఇంగ్లీష్ వెర్షన్ కు రీమేక్ కాదని, ఈ రెండు విభిన్నమైన కథలుగా ఈ వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయనే వార్తలు ముందు నుంచే ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ ప్రచారంతో అది నిజమే అని తెలుస్తోంది. మొత్తానికి వరుణ్ ధావన్, సమంత ఈ వెబ్ సిరీస్ లో ప్రియాంకకు తల్లిదండ్రులుగా కనిపిస్తారనే వార్తలతో ‘సిటాడెల్’ హందీ వెర్షన్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ విషయాన్ని ఇంగ్లీష్ వెర్షన్ చివరి ఎపిసోడ్ లో రివీల్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ వెబ్ సిరీస్ హిందీ వెర్షన్ 1990 దశకం నాటి కథతో రూపొందుతుందనే టాక్ కూడా ఉంది. ఇందులో సమంత, వరుణ్ ధావన్ లు అప్పటి జనరేషన్ జంట లా కనిపించనున్నారని సమాచారం. అటు సమంత తాజాగా నటించిన ‘ఖుషీ’ సినిమా కూడా విడుదలకు రెడీ అయ్యింది.
Read Also: త్వరలో అనౌన్స్ చేస్తాం, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లిపై స్పందించిన నాగబాబు!
Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
Aditya L1: ఇస్రో కీలక అప్డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1
/body>