Samantha Naga Chaitanya Divorce సమంత-చైతూ విడాకులపై నాగార్జున వ్యాఖ్యలు.. ఇందులో నిజమెంత?

కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులపై నాగార్జున షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చార‌ని... సమంతే ముందు విడాకులు అడిగిందని ఆయ‌న అన్న‌ట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యాఖ్యలు ఒకసారి చూస్తే... 

FOLLOW US: 

అక్కినేని నాగచైతన్య, సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారు? ఈ ప్రశ్నకు ఇప్పటికీ చాలా మందికి సమాధానం తెలియదు. తెలుసుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. అయితే... నాగార్జున ఈ విడాకుల మీద ఓ ఇంటర్వ్యూలో స్పందించినట్టు గురువారం ఉదయం నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. చై - సామ్ విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేశారంటూ... విడాకులు తీసుకోవడానికి కారణం సమంత అని, ఆమె కోరడంతో చైతన్య విడాకులు ఇచ్చాడని ఆయన కొచ్చినట్టు రాసుకొచ్చాయి.

అసలు నాగార్జున ఏమన్నారని నేషనల్ మీడియా పేర్కొందంటే... "నాగచైతన్య, సమంతకు వివాహమైన నాలుగు సంవత్సరాల్లో విడిపోయే అంతటి సమస్య నాకు తెలిసినంత వరకూ రాలేదు. ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. గత ఏడాది కొత్త సంవత్సర వేడుకలను కూడా కలిసే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాతే ఏదో సమస్య వచ్చింది. దాంతో విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. సమస్య ఏమిటన్నది నాకు కచ్చితంగా తెలియదు. కానీ, విడుదల కావాలని సమంతే కోరింది. విడాకులకు దరఖాస్తు చేసింది. దాంతో ఆమె నిర్ణయాన్ని చైతన్య గౌరవిస్తూ తన అంగీకారం తెలిపాడు. అయితే... విడాకుల విషయంలో నా గురించి చైతన్య ఎక్కువ బాధపడ్డాడు. నేను ఎలా స్పందిస్తానోనని ఎక్కువ ఆలోచించాడు. కుటుంబ పరువు ఏమవుతుంది? కుటుంబ మర్యాద ఏమవుతుంది? అని ఎక్కువ మథనపడ్డాడు" అని! ఈ వ్యాఖ్యలు నిజమా? కాదా? అనేది పక్కన పెడితే... సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

విడాకుల తర్వాత సమంత మీద ఎక్కువ ట్రోల్స్ వచ్చాయి. ఓ దశలో విమర్శలు పెరగడంతో సమంత స్పందించక తప్పలేదు. ఆమెకు ఎవరితోనో సంబంధం ఉందని, డబ్బు కోసం విడాకులు తీసుకున్నారని, పిల్లల్ని కనడం ఇష్టం లేదని వచ్చిన పుకార్లను ఖండించారు. విడాకుల తర్వాత ఒక సందర్భంలో చచ్చిపోవాలని అనిపించినట్టు కూడా చెప్పుకొచ్చారు. తర్వాత తాను స్ట్రాంగ్ అయ్యానని ఆమె అన్నారు.

ఇక, నాగచైతన్య విషయానికి వస్తే... 'బంగార్రాజు' విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరి సంతోషం కోసమే విడాకులు తీసుకున్నట్టు తెలిపారు. అంతకు మించి విడాకుల గురించి నాగచైతన్య స్పందించలేదు. ఎక్కువ సందర్భాల్లో అతను మౌనం వహిస్తున్నారు. తనపై విమర్శలు వస్తున్నాయి కనుక సమంత స్పందించక తప్పడం లేదు. అయితే... విడాకుల తర్వాత ఎవరి సినిమాలు వారు చేసుకుంటున్నారు. ఇప్పట్లో ఇద్దరూ కలిసి నటించే అవకాశాలు లేకపోవచ్చు. కానీ, సమంతతో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ షేర్ చేసుకున్నట్టు ఇటీవల నాగచైతన్య చెప్పడం విశేషం. 

Published at : 27 Jan 2022 02:15 PM (IST) Tags: Akkineni Nagarjuna samantha Naga Chaitanya nagarjuna Samantha Naga Chaitanya Divorce Nagarjuna Shocking Comments About Samantha Naga Chaitanya Divorce Nagarjuna About Chay-Sam Divorce The Reason Behind Samantha Naga Chaitanya Divorce

సంబంధిత కథనాలు

NTR Jayanthi: కృష్ణుడిగా 17 సినిమాల్లో - ఎన్టీ రామారావు సినీ జీవితంలో ఈ విశేషాలు మీకు తెలుసా?

NTR Jayanthi: కృష్ణుడిగా 17 సినిమాల్లో - ఎన్టీ రామారావు సినీ జీవితంలో ఈ విశేషాలు మీకు తెలుసా?

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Krishna On Mahesh Babu: కృష్ణను స్టూడియో అంతా పరుగులు పెట్టించిన మహేష్ - అమ్మాయి గురించి నానా గొడవ

Krishna On Mahesh Babu: కృష్ణను స్టూడియో అంతా పరుగులు పెట్టించిన మహేష్ - అమ్మాయి గురించి నానా గొడవ

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

టాప్ స్టోరీస్

NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

NTR Centenary birth celebrations :   తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?