Salman Khan: లేడీ రిపోర్టర్‌కు సల్మాన్ ముద్దు, నెట్టింట వీడియో వైరల్
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ లేడీ రిపోర్టర్‌కు ముద్దు పెట్టారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
![Salman Khan: లేడీ రిపోర్టర్‌కు సల్మాన్ ముద్దు, నెట్టింట వీడియో వైరల్ Salman Khan gives tight hug kisses to senior journalist at IFFI Goa Watch Viral Video Telugu News Salman Khan: లేడీ రిపోర్టర్‌కు సల్మాన్ ముద్దు, నెట్టింట వీడియో వైరల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/22/467b7699f22bd43427d25aaedc0ab7b41700644867528544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Salman Khan Gives a Tight Hug and Kisses to Senior Journalist: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చాలా జోవియల్ గా ఉంటారు. అందరితో ఇట్టే కలిసి పోతారు. చక్కగా నవ్వుతూ పలకరిస్తారు. అభిమానులతో మరింత ఫన్ గా ఉంటారు. తాజాగా ముంబైలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ లేడీ జర్నలిస్టును ఆయన ముద్దు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
సల్మాన్ ముద్దు పెట్టిన జర్నలిస్టు ఎవరు?
సల్మాన్ మేనల్లుడు అలీజ్ అగ్నిహోత్రి ‘ఫెర్రీ’ సినిమాతో రీసెంట్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. అతడితో కలిసి గోవాలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలకు సల్మాన్ హాజరయ్యారు. అక్కడ సీనియర్ రిపోర్టర్ గా ఉన్న తన స్నేహితురాలిని సల్మాన్ ఖాన్ చూశారు. వెంటనే ఆమెను ఆప్యాయంగా పలకరించారు. దగ్గరికి తీసుకుని నుదిటిపై ముద్దు పెట్టారు. ఆమె కూడా సల్మాన్ ను సరదాగా పలకరించింది. డ్రామాలు చేయకు అంటూ అతడి బుగ్గలను నిమిరింది. ఆ తర్వాత సల్మాన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వీడియో సోషల్ వైరల్‌గా మారింది. సల్మాన్ స్టార్ హీరోగా ఎదిగినా, తన స్నేహితురాలిని ఎంత బాగా గుర్తుపట్టారో? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘టైగర్ 3’
తాజాగా సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదల అయ్యింది. తొలుత కాస్త నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా, ఆ తర్వాత పుంజుకుంది. థియేటర్లకు ఆడియెన్స్ తాడికి పెరిగింది. నెమ్మదిగా ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా దుమ్మురేపుతోంది. ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ యాక్షన్ సీక్వెన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ‘టైగర్ జిందా హై’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో ఐదో సినిమాగా ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. సుమారు రూ. 300 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆదిత్య చోప్రానే ఈ సినిమాకు కథ అందించారు.
‘టైగర్4’ నిర్మాణ పనులు షురూ!
ఇక ‘టైగర్ 3’ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా చేశాడు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ గెస్ట్ రోల్స్ లో ఆకట్టుకున్నారు. ‘టైగర్ 3’ అద్భుత విజయాన్ని అందుకోవడంతో త్వరలోనే ‘టైగర్4’ కూడా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతున్నట్లు సమాచారం.
Read Also: ఓటీటీలోకి ‘మార్టిన్ లూథర్ కింగ్’, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)