అన్వేషించండి
Advertisement
Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో బాలీవుడ్ స్టార్స్ - ఉపాసన పోస్ట్ వైరల్
సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా.. మెగా ఫ్యామిలీ ఆతిథ్యం ఇస్తుంటుంది.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఇంట్లో బాలీవుడ్ స్టార్స్ సందడి చేస్తున్నారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్, పూజాహెగ్డే, వెంకీ.. చరణ్ ఇంటికి గెస్ట్ లుగా వెళ్లారు. ఇప్పుడేమో ఆమిర్ ఖాన్ వచ్చారు. వీటికి సంబంధించిన ఫొటోలను ఉపాసన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సల్మాన్ ఖాన్ నటిస్తోన్న 'కభీ ఈద్ కభీ దివాలి' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా.. మెగా ఫ్యామిలీ ఆతిథ్యం ఇస్తుంటుంది. ఇందులో భాగంగానే రామ్ చరణ్.. సల్మాన్ ను తన ఇంటికి డిన్నర్ కోసం ఆహ్వానించారు. సల్మాన్ తో పాటు 'కభీ ఈద్ కభీ దివాలి'లో నటిస్తోన్న పూజా, వెంకీ కూడా వచ్చినట్లు ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని టాక్. ఒక రోజు సల్మాన్ ఖాన్ ను డిన్నర్ కి పిలవగా.. మరొక రోజు ఆమిర్ ఖాన్ ను పిలిచినట్లు తెలుస్తోంది.
రెండు ఈవెనింగ్స్ చాలా ఎంజాయ్ చేశామని ఉపాసన క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీనికి 'అధికారి', 'సిటిజెన్స్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను అమృత్ సర్ లో మొదలుపెట్టనున్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion