Salaar: రీమేక్ కాదంటున్న ప్రభాస్ నిర్మాత - అయితే 'సలార్' కొత్త కథేనా?
Salaar trailer gives Ugramm vibes: ప్రశాంత్ నీల్ తొలి సినిమా 'ఉగ్రం'ను మరోసారి తీశారని, 'సలార్' రీమేక్ అని జరుగుతున్న ప్రచారంపై హోంబలే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగందూర్ స్పందించారు.
Is Salaar remake of Ugramm?: 'సలార్' ట్రైలర్ విడుదలైన తర్వాత కన్నడ సినిమా 'ఉగ్రం' పేరు తెరపైకి వచ్చింది. 'కెజియఫ్' రెండు భాగాల తర్వాత ప్రశాంత్ నీల్ పేరు జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకు తెలిసింది. అయితే... ఆ సినిమాల కంటే ముందు కన్నడలో ఆయన చేసిన చిత్రమే 'ఉగ్రం'.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్' కథ, 'ఉగ్రం' కథ ఒక్కటేనని... ప్రశాంత్ నీల్ గతంలో తీసిన సినిమాను తిప్పి తీస్తున్నారని, రీమేక్ చేస్తున్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడు రవి బస్రూర్ సైతం కన్నడ మీడియాతో ఓసారి 'ఉగ్రం సినిమాకు 'సలార్' రీమేక్ అని అందరికీ తెలిసిన విషయమే అని చెప్పారు. ట్రైలర్ విడుదల తర్వాత రెండు కథల మధ్య కంపేరిజన్స్ మొదలు అయ్యాయి. కట్ చేస్తే... నిర్మాత విజయ్ కిరగందూర్ ఆ రూమర్స్ మీద ఓపెన్ అయ్యారు.
'ఉగ్రం' చిత్రానికి 'సలార్' రీమేక్ కాదు!
''ఉగ్రం, కెజియఫ్... ఆ రెండు ప్రపంచాలను క్రియేట్ చేసింది ప్రశాంత్ నీల్. ప్రతి సారీ కొత్త సినిమా ఎలా అందివ్వాలో అతనికి తెలుసు. 'సలార్' మీద జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు'' అని హిందీలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత విజయ్ కిరగందూర్ పేర్కొన్నారు. ఆయన రీమేక్ కాదని స్పష్టంగా చెప్పినప్పటికీ... 'సలార్' ట్రైలర్ & 'ఉగ్రం' కథల మధ్య కంపేరిజన్స్ కొందరు చూపిస్తున్నారు.
Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!
ఉగ్రం... సలార్... ప్రాణ స్నేహితులు!
'నీ కోసం ఎర అయినా అవుతా! సొర అయినా అవుతా' - ట్రైలర్ ప్రారంభంలో యంగ్ 'సలార్' (ప్రభాస్ చిన్ననాటి పాత్రధారి) చెప్పే డైలాగ్. స్నేహితుడి కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉండే వ్యక్తిగా హీరోని చూపించారు.
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)... 'సలార్'లో వీళ్లిద్దరూ ప్రాణ స్నేహితులుగా కనిపిస్తారని ట్రైలర్ చూస్తే అర్థం అయ్యింది. కుర్చీ కోసం జరిగిన కుతంత్రాలు, యుద్ధంలో ప్రత్యర్థులు వేర్వేరు దేశాల నుంచి సైనాలను దింపితే... వరద రాజ మన్నార్ మాత్రం తన స్నేహితుడు దేవా (ప్రభాస్)ను పిలుస్తాడు. ఆ ఒక్కడూ వందల మంది సైన్యంతో సమానమని చెప్పకనే చెప్పారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమ చూపించే వాళ్ళిద్దరూ శత్రువులుగా మారితే? అదీ సినిమా కథ.
ఒక్కసారి 'సలార్' కథ పక్కన పెట్టి... 'ఉగ్రం' కథను చూస్తే? అందులోనూ హీరోకి ఓ స్నేహితుడు ఉంటాడు. చీకటి సామ్రాజ్యంలో స్నేహితుడిది పైచేయి కావాలని, అతనికి అధికారం కట్టబెట్టాలని స్నేహితుడు వస్తాడు. అందరినీ ఎదురించి మాఫియా సామ్రాజ్యంలో కుర్చీ కట్టబెడతాడు. తర్వాత స్నేహితుల మధ్య దూరం పెరుగుతుంది. ఫ్రెండ్ తమ్ముడి చావుకు హీరో కారణం అవుతాడు. దాంతో స్నేహం బదులు శత్రుత్వం ఏర్పడుతుంది.
Also Read: పిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
'ఉగ్రం' కథకు, 'సలార్' ట్రైలర్ (Salaar Trailer)లో ప్రభాస్ చూపించిన అంశాలకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయని నెటిజనులే చెబుతున్నారు. సినిమా రిలీజ్ అయితే ఎంత వరకు కరెక్ట్ అనేది తెలుస్తుంది. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'ఉగ్రం' సినిమాకు 'సలార్' రీమేక్ కాదని ప్రశాంత్ నీల్ చెప్పారు. రెండు సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయేమో!? వెయిట్ అండ్ వాచ్!