Sai Dharam Tej: అతడి వల్లే ఇంకా బతికున్నా, సాయి ధరమ్ తేజ్ 'థాంక్యూ నోట్'
తన కొత్త సినిమాను ప్రకటించే ముందు ఓ థాంక్యూ నోట్ ను షేర్ చేశారు సాయి ధరమ్ తేజ్.
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఆయన చివరిగా 'రిపబ్లిక్' సినిమాలో కనిపించారు. అయితే ఆ సినిమా రిలీజ్ కి ముందే ఈ మెగా హీరోకి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. బైక్ స్కిడ్ అయి పడిపోవడంతో షాక్ లోకి వెళ్లిపోయారు ధరమ్ తేజ్. దీంతో చాలా రోజులు హాస్పిటల్ లోనే ఉంచి ట్రీట్మెంట్ అందించారు. ఆయనిప్పుడు పూర్తిగా కోలుకోవడంతో కొత్త సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నారు. తన కొత్త సినిమాను ప్రకటించే ముందు ఓ థాంక్యూ నోట్ ను షేర్ చేశారు.
అందులో తన ఫ్యామిలీకి, స్నేహితులకు, తనను కాపాడిన వారికి, హాస్పిటల్ యాజమాన్యానికి, ఫ్యాన్స్ కు థాంక్స్ చెప్పారు. ముందుగా తనను హాస్పిటల్ లో జాయిన్ చేసిన సయ్యద్ అబ్దుల్ ఫరూఖ్ కి థాంక్స్ చెప్పారు. తను ఈరోజు బతికి ఉన్నానంటే దానికి కారణం ఆయనేనని చెప్పారు. చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చరణ్, బన్నీ, వరుణ్, వైషు, ఉపాసన ఇలా అందరూ తనకోసం నిలబడ్డారని చెప్పారు.
తను హాస్పిటల్ లో ఉన్నానని తెలిసి వచ్చిన ఇండస్ట్రీ స్నేహితులకు, నటీనటులకు, దర్శకులకు ధన్యవాదాలు చెప్పారు. అలానే అందరి హీరోల ఫ్యాన్స్ తన ఆరోగ్యం కోసం పూజలు చేశారని.. అన్నదానాలు చేశారని.. వారందరికీ థాంక్స్ చెప్పారు. మరో రెండు రోజుల్లో సుకుమార్ నిర్మాతగా కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు చెప్పారు.
Also Read: రామ్ చరణ్‌ను చూసి గర్వపడుతున్నా, మా బావ ఎన్టీఆర్ పవర్ హౌస్! - 'ఆర్ఆర్ఆర్ఆర్ఆర్ఆర్'కు బన్నీ రివ్యూ" href="https://telugu.abplive.com/entertainment/cinema/allu-arjun-reviews-rrr-allu-arjun-proud-of-ram-charan-and-calls-ntr-as-power-house-post-rrr-show-read-his-tweet-27255" target="_blank" rel="noopener">'కు బన్నీ రివ్యూ
Also Read: స్టార్ హీరో విజయ్ చనిపోయాడంటూ ట్రోలింగ్, యాంటీ ఫ్యాన్స్ దారుణమైన కామెంట్స్
View this post on Instagram