Sai Dharam Tej's Satya: రిపబ్లిక్ డే స్పెషల్, సాయి ధరమ్ తేజ్ - కలర్స్ స్వాతి మ్యూజికల్ వీడియో
రిపబ్లిక్ డే సందర్భంగా ఓ స్సెషల్ మ్యూజికల్ వీడియోను విడుదల చేయనున్నట్లు దిల్ రాజు బ్యానర్ ప్రకటించింది. ఇందులో సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నటిస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది.
టాలీవుడ్ లో మెగా కాాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆయన. అయితే 2021 లో వచ్చిన ‘రిపబ్లిక్’ సినిమా తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. ఆ ఏడాది ఆయనకు బైక్ యాక్సిడెంట్ అవ్వడంతో కొన్నాళ్లు ఇంటికే పరిమితం అయ్యారు. తర్వాత నెమ్మదిగా మళ్లీ షూటింగ్ లలో పాల్గొంటున్నారు సాయి ధరమ్ తేజ్. తాజాగా సాయి ధరమ్ తేజ్ నుంచి ‘సత్య’ అనే ఓ మ్యూజిక్ వీడియో వస్తోంది. దానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.
ఈ సాంగ్ లో కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పోస్టర్ లో సాయిధరమ్ తేజ్ బస్సు దిగొస్తుండగా.. స్వాతి అతన్ని హత్తుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ ను హీరో సాయి ధరమ్ తేజ్ తన ఇస్టాగ్రామ్ ఖాతా లో షేర్ చేశారు. ఈ పోస్ట్ లో సాయి ధరమ్ తేజ్ ఇలా రాసుకొచ్చారు. ‘స్నేహితులంతా కలిసి ఎంతో ఇష్టంగా చేసిన ప్రాజెక్టు ఇది ఎంతో ప్రత్యేకమైంది. ఈ విషయాన్ని మీ అందిరితో చెప్పడానికి ఎక్జయిట్మెంట్ గా ఉంది’ అని ట్వీట్ చేశారు. అలాగే ఈ సత్య పేరుతో టైటిల్ సాంగ్ కూడా ఉన్నట్టు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ మ్యూజిక్ వీడియోను సాయి ధరమ్ తేజ్ స్నేహితుడు నవీన్ విజయ్ కృష్ణ డైరెక్ట్ చేయనున్నారు.
అలాగే ఈ మ్యూజిక్ వీడియోను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా దిల్ రాజు ఈ మ్యూజిక్ వీడియో గురించి అనౌన్స్ చేశారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి కూడా సరైన గుర్తింపుకు నోచుకోని రియల్ హీరోలకు నివాళిగా మ్యూజిక్ వీడియోను రూపొందిస్తున్నట్టు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రకటించింది. ఈ మ్యూజిక్ వీడియో కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాము అని తెలిపారు మేకర్స్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ‘విరూపాక్ష’ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన టీజర్ వీడియో విడుదల అయ్యి ఆకట్టుకుంది. అలాగే సంపత్ నంది కథకు కూడా సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన నటించిన చివరి సినిమా ‘రిపబ్లిక్’. ఈ మూవీ పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నా కమర్షియల్ గా హిట్ అందుకోలేకపోయింది. యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోలుకున్న సాయి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక గతేడాది ‘పంచతంత్రం’ వంటి అంథాలజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది స్వాతి. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత స్వాతి ప్రస్తుతం ‘ఇడియట్స్’, ‘మంత్ ఆఫ్ మధు’ వంటి ప్రాజెక్టులు చేస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి జంటగా వస్తోన్న ఈ మ్యూజిక్ వీడియో పై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.
View this post on Instagram