Nayanthara: సరోగసీ ప్లానింగ్ లో నయనతార, నిజమేనా?
ఇటీవల విఘ్నేష్ శివన్, నయనతార కలిసి చెన్నైలో ఓ గుడిలో పూజ చేయించుకున్నారు. ఆ గుడి నుంచి బయటకు వస్తోన్న సమయంలో నయనతార నుదిటి మీద కుంకుమ ఉంది.

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార చాలా కాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో రిలేషన్ లో ఉంది. ఈ జంటకు పెళ్లైపోయిందని అంటుంటారు కానీ ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే విఘ్నేష్ తో ఎంగేజ్మెంట్ అయిందనే విషయాన్ని మాత్రం గతేడాది నయన్ వెల్లడించింది. సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని టాక్. ఇప్పుడు ఏకంగా ఈ జంట సరోగసీ ద్వారా బిడ్డను కందామని ఫిక్స్ అయినట్లు సమాచారం.
ఇటీవల విఘ్నేష్ శివన్, నయనతార కలిసి చెన్నైలో ఓ గుడిలో పూజ చేయించుకున్నారు. ఆ గుడి నుంచి బయటకు వస్తోన్న సమయంలో నయనతార నుదిటి మీద కుంకుమ ఉంది. పెళ్లైన స్త్రీలు నుదిటి సింధూరం పెట్టుకున్నట్లుగా నయన్ కూడా పెట్టుకోవడంతో ఈ జంటకి పెళ్లైపోయిందని అంటున్నారు. చాలా ఏళ్లుగా నయనతార, విఘ్నేష్ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు నయనతార సరోగసీ పద్ధతి ద్వారా తల్లి కావాలనుకుంటోందని సమాచారం.
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు సరోగసీ పద్ధతి ద్వారా సంతానాన్ని తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. ప్రియాంక చోప్రా, మంచు లక్ష్మీ, శిల్పా శెట్టి, కరణ్ జోహార్ ఇలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నయనతార కూడా అదే రూట్ ఫాలో అవ్వబోతుంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియదు. విఘ్నేష్ కానీ, నయన్ కానీ ఈ రూమర్లపై స్పందించలేదు.
Also Read: మిడిల్ ఫింగర్ చూపించిన దీపికా, ఫొటో వైరల్
Also Read: ఎన్టీఆర్ కోసం స్పెషల్ బైక్, ఎంత ఖర్చు పెట్టారంటే?
View this post on Instagram
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















