By: ABP Desam | Updated at : 09 Dec 2022 06:05 PM (IST)
Edited By: Mani kumar
RRR
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ మూవీ ఈ యేడాది మార్చి 24 న విడుదలైంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలసి నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డులు సృష్టించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే అందరూ ఈ సినిమా ఆస్కార్ అవార్డు నామినేషన్ కు ఎంపిక అవుతుందని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ సినిమాను ప్రకటించింది భారత ప్రభుత్వం. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా మాత్రం అస్కార్ బరిలో నిలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అందుకోసం వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు దర్శకుడు రాజమౌళి.
తాజాగా నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూలో ఈ యేడాది 10 ఉత్తమ చిత్రాలలో ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా చోటు దక్కించుకుంది. దీంతో ఆస్కార్ నామినేషన్ కోసం ఈ చిత్రం ఓ అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు. అయితే ఈ పది చిత్రాల జాబితాలో మొదటి చిత్రం గా జోసెఫ్ కోసిన్స్కి దర్శకత్వం వహించిన యాక్షన్ సీక్వెల్ ‘టాప్ గన్: మావెరిక్’ నిలిచింది.
మరోవైపు ‘ఆర్.ఆర్.ఆర్’ కు వరుసగా అవార్డులు వస్తున్నాయి. ఇటీవల హాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా భావించే హెచ్.సీ.ఏ(HCA) స్పాటిలైట్ అవార్డును ఆర్.ఆర్.ఆర్ గెలుచుకుంది. అలాగే అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఈ యేడాదికి గాను ఉత్తమ అంతర్జాతీయ సినిమా అవార్డుకు ఆర్.ఆర్.ఆర్ ను ఎంపిక చేసింది. ఇలా వరుసగా అవార్డులు గెలుచుకోవడంతో ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇక 95వ అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవం 2023, మార్చిలో జరగనుంది. ఇందుకోసం రాజమౌళి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆస్కార్ బరిలో ఈ సినిమా నిలుస్తుందో లేదో చూడాలి.
Also Read : ఓ చేతిలో మేకపిల్ల, మరో చేతిలో గొడ్డలితో సిలిండర్ - 'వాల్తేరు వీరయ్య'లో మాస్ మహారాజ్
ఇటీవల ఈ సినిమాను జపాన్ లో విడుదల చేసింది చిత్ర యూనిట్. దానికోసం రాజమౌళి అండ్ టీమ్ అక్కడకు వెళ్ళి ప్రచారం చేశారు కూడా. అక్కడ కూడా ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నిజానికి రాజమౌళి గతంలో తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమాను జపాన్ లో విడుదల చేస్తే అక్కడ మంచి ఆదరణ దక్కించుకుంది. ప్రభాస్ కి అక్కడ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. రికార్డు స్థాయి వసూళ్లతో బాహుబలి 2 రెండో ఇండియన్ సినిమాగా నిలిచింది. అలాగే ‘ఆర్.ఆర్.ఆర్’ ను కూడా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు రాజమౌళి. నిర్మాత డివివి దానయ్య 400 కోట్లకు పైగానే బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా చేసిన ఈ మూవీ లో అజయ్ దేవ్ గణ్, శ్రియా, సముద్రఖని ప్రధాన పాత్రల్లో కనిపించారు.
Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?
Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా
Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!
Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి
Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!