RRR Live Updates: మొదటి షో మొదలైపోయింది - ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదుగా!
ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి షో పడింది. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంది? ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? టాక్ ఎలా ఉంది? లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం...
LIVE
Background
'RRR' మేనియా మొదలైంది. ఈ సినిమా సాధించబోయే విజయం మీద ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే... ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇరగదీశారని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సినిమాకు కలరిస్ట్‌గా పని చేసిన శివకుమార్ బీవీఆర్ అయితే... మూడు వేల కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేస్తుందని చెబుతున్నారు.
'ఆర్ఆర్ఆర్' కోసం రాజమౌళి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం గుర్రం, బైక్ లను వాడారు. రామ్ చరణ్ గుర్రం మీద వెళితే.. ఎన్టీఆర్ బైక్ పై వెళ్తూ కనిపించారు. అయితే ఈ బుల్లెట్ కోసం చాలానే ఖర్చు పెట్టారట. ఈ ఒక్క బైక్ కోసమే రాజమౌళి చాలా రీసెర్చ్ చేశారట. బుల్లెట్ కంపెనీ పేరు వెలో సెట్ మోటార్ బైక్. బ్రిటన్ కు చెందిన ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ బర్మింగ్ హమ్ లో ఉంది.
సినిమాలో ఎన్టీఆర్ ఉపయోగించిన బైక్ 1920 తరువాత చెందిన ఎమ్ సిరీస్ మోడల్ లా కనిపిస్తుంది. ఇక వెలో సెట్ మోటార్ బైక్ కంపెనీ 1920 నుంచి 1950 వరకు అంతర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో టాప్ ప్లేస్ లో ఉండేది. ఆ తరువాత 1970లలో ఈ కంపెనీ బైక్ లను తయారు చేయడం మానేసింది. 'ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ కి బైక్ కావాలనుకున్నప్పుడు రాజమౌళి అప్పట్లో బైక్స్ ఉత్పత్తి చేయడంలో ఎవరు టాప్, ఎలాంటి మోడల్స్ చేసేవారని పరిశీలించి.. ఇప్పుడున్న మోటార్ బైక్ ని తనకు కావాల్సినట్లుగా అప్పటి మోడల్ లో కనిపించేలా దాదాపు రూ.10 లక్షలు ఖర్చు పెట్టి మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన మొదటి షో ముంబైలో ప్రారంభం అయిపోయింది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం తమ ఎదురుచూపులను సెలబ్రేషన్స్ రూపంలో తెలియజేస్తున్నారు. చిత్ర బృందం, ప్రేక్షకుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ఐదు థియేటర్ లలో స్పెషల్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ లోని ఐదు థియేటర్లలలో స్పెషల్ షోలకు అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలోని మల్లికార్జున(కూకట్‌పల్లి), భ్రమరాంబ(కూకట్‌పల్లి), విశ్వనాథ్(కూకట్‌పల్లి), అర్జున్ (కూకట్‌పల్లి), శ్రీరాములు(మూసాపేట) థియేటర్లకు మాత్రమే ఉదయం 7 గంటల కన్నా ముందు షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పర్మిషన్ 25వ తేదీకి మాత్రమే పరిమితం. ఈ థియేటర్లలో తప్ప మిగతా చోట్ల ఇంకెక్కడైనా సినిమాను నిర్ణీత సమయాల కన్నా ముందుగా ప్రదర్శిస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం పేర్కొంది.
వెన్నెల కిశోర్ ట్వీట్.. అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందే!
Posting it on my whatsapp status just to see how many are awake🤣🤣😂😂.. https://t.co/KVFOjGxizc pic.twitter.com/ouLGgyoljn
— vennela kishore (@vennelakishore) March 24, 2022
రాయలసీమలో చరణ్ ఫ్యాన్స్ హంగామా
జమ్మలమడుగులో రామ్ చరణ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్
MASSive Celebrations in JMD 🔥💥
— Bharath RC Kajuu™🔥 (@BharathRCKajal) March 24, 2022
Ceeded Gadda @AlwaysRamCharan Adda 🔥#RamCharan #RRRMovie #ManOfMassesRamCharan pic.twitter.com/YdSFSqvNxM
తారక్‌కు డాలర్ల దండ
డల్లాస్‌లో ఎన్టీఆర్ ఫొటోకు అభిమానులు డాలర్ల దండేశారు.
#RRRMovie Celebrations in Texas, USA. Dollar $ Maalai. Adaengappa..
— VCD (@VCDtweets) March 24, 2022
Show starting in 10 mins. pic.twitter.com/XKvUQcWeqH
బ్రిటిష్ గడ్డపై కూడా ‘తగ్గేదేలే’
యూకేలో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
#RRRinUK 🇬🇧#RRR #RRRMovie
— Manyu Cinemas (@ManyuCinemas) March 24, 2022
Celebrations From
📍Piccadilly Cinema,Leicester #SSrajamouli #NTR #RamCharan @tollywood_UK_EU @TeamDreamZE pic.twitter.com/VCvDrhgNpU
బెంగళూరు సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా
బెంగళూరులో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఆకాశాన్నంటాయి.
Manasa bangalore @tarak9999 fans celebrations#ManOfMassesNTR #RRRMovie pic.twitter.com/Nu3rJIlq9z
— ●▲■ (@Player456____) March 24, 2022