Ethara Jenda: ఎత్తర జెండా అంటున్న తారక్, చరణ్ - ఆర్ఆర్ఆర్ పండగ పాట వచ్చేస్తుంది - ప్రమోషన్స్ షురూ చేసిన జక్కన్న!
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాతి సాంగ్ ఎత్తర జెండా మార్చి 14వ తేదీన విడుదల కానుంది.
ఆర్ఆర్ఆర్ రెండో విడత ప్రమోషన్సకు సర్వం సిద్ధం అయింది. ‘ఎత్తర జెండా’ పేరుతో ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ ఆంథెమ్ విడుదల కానుంది. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ ముగ్గురూ ఉండనున్నారు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ సినిమా మార్చి 25వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్లను పీక్ స్టేజ్‌కి తీసుకువెళ్లనున్నారు. సినిమాకు సంబంధించిన యూఎస్ ప్రీ-సేల్స్ ఇప్పటికే మిలియన్ డాలర్లను దాటేశాయి.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ సరసన ఆలియా భట్, జూనియర్ ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. వీరితో పాటు అజయ్ దేవ్‌గణ్, శ్రియ, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాకు మార్చి 24వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెయిడ్ ప్రీమియర్లు పడతాయని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ధరల పెంపుపై ఎటువంటి అనుమానాలూ లేకపోయినా... ఏపీలో ఏ పరిస్థితులు నెలకొంటాయో చూడాలి. అలాగే బాహుబలి ఫ్రాంచైజీ కలెక్షన్లను ఈ సినిమా దాటుతుందని కూడా ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆర్ఆర్ఆర్ సినిమాపై దేశవ్యాప్తంగా ట్రేడ్ వర్గాలు ఓ కన్నేశాయి.
View this post on Instagram
Brace yourselves for the joyful #RRRCelebrationAnthem ⚡🔥🌊
— RRR Movie (@RRRMovie) March 10, 2022
Song out on March 14th…#RRRonMarch25th @ssrajamouli @tarak9999 @alwaysramcharan @aliaa08 @OliviaMorris891 @mmkeeravaani @DVVMovies @RRRMovie #RRRMovie#EttharaJenda #Sholay #Koelae #EtthuvaJenda #EtthukaJenda pic.twitter.com/Ehlffl8L9P