RRR-Acharya: ఆచార్య విడుదల RRR తో ముడిపడి ఉందా..ఇదేం లెక్క..

జక్కన్న చెక్కిన శిల్పం 'ఆర్ ఆర్ ఆర్ ' ముసుగు తొలగించే టైం వచ్చేసిందని ఆత్రుతగా ఎదురుచూసిన ప్రేక్షకులకు షాకిస్తూ విడుదల వాయిదా పడింది. రాజమౌళికి అలవాటే కదా అనుకుంటే ఇప్పుడా ఎఫెక్ట్ మరో సినిమాపై పడిందట

FOLLOW US: 

ఎప్పుడెప్పుడా అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ వాయిదాల పర్వం కొనసాగుతోంది.  ఒమిక్రాన్‌, కరోనా ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటం, పరిమితులు విధించడంతో సినిమా విడుదలని వాయిదా వేయాలని నిర్ణయించింది చిత్రబృందం. ఈ  మేరకు అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీ ఎప్పుడన్నది మాత్రం ప్రకటించలేదు. దీంతో ఈ రోజు జాతరని తలపించాల్సిన థియేటర్లు ఎప్పటిలా అలా నడిచిపోతున్నాయ్. ఇప్పటికే కరోనా ప్రభావంతో పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ జనవరి7 శుక్రవారం విడుదల కావాల్సింది. కానీ వారం క్రితం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి షాకిచ్చారు. పోనీలే రాజమౌళికి వాయిదాలు వేయడం అలవాటే కదా అని సర్దుకుపోయిన సినీ ప్రియులకు ఆచార్య రూపంలో మరో షాక్ తగిలేలా ఉందంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. ఎందుకంటే RRR విడుదల కాకుండా ఆచార్య విడుదల చేసే ఛాన్స్ లేదంటున్నారు.  ఈ రెండింటికీ లింకేంటి అంటారా..

Also Read:  ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అదిరిపోయే రికార్డ్, బాలకృష్ణ ఎక్కడా తగ్గట్లేదుగా..
ఆచార్య సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్.  పైగా జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ విడుదల హడావుడి అయిపోతే సమ్మర్లో కేజీఎఫ్ వచ్చేలోగా ఈ మధ్యలో చాలా డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు బడా ప్రొడ్యూసర్స్. భీమ్లానాయక్, సర్కారువారి పాట, రాధే శ్యామ్ ఇలా అన్ని వచ్చేస్తాయనుకుంటే ఒక్కొక్కటీ సంక్రాంతి బరినుంచి తప్పుకున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సునామి శాంతించేసరికి ఆచార్య వస్తుందని సర్దుకుపోయారు ప్రేక్షకులు. కానీ ఆచార్య కూడా చెప్పిన టైంకి రావడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం కరోనా, ఒమిక్రాన్ కాదు..రాజమౌళి అని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ విడుదల తర్వాతే ఆచార్య విడుదల చేయాలనే ఒప్పందమే ప్రధాన కారణం అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో చరణ్ ని చూసిన తర్వాతే ఆచార్యలో చరణ్ ని ప్రేక్షకులు చూడాలని రాజమౌళి కండిషన్ పెట్టాడని.. ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో ఉన్నప్పుడు కొరటాల శివ సహా ఆచార్య నిర్మాతలు ఈ మేరకు ఓకే చెప్పారని తెలుస్తోంది. అంటే ఎప్పుడైనా RRR విడుదల తర్వాత ఆచార్య వస్తుందన్నది దీని అర్థం. 

Also Read: అజిత్‌ సినిమాకు కరోనా ఎఫెక్ట్‌... వలిమై రిలీజ్‌ వాయిదా వేసిన చిత్ర బృందం
ఈ లెక్కన ఆచార్య విడుదల కూడా రాజమౌళి పై ఆధారపడి ఉందన్నమాట. ఒకవేళ ఈ ఏడాది వేస‌విలో ఆర్‌.ఆర్‌.ఆర్ విడుద‌ల చేస్తే.. ఆ త‌ర‌వాత 15 రోజుల‌కో, నెల‌కో ఆచార్య‌ విడుద‌ల చేస్తారు. పైగా ఆర్ ఆర్ ఆర్ దేశవ్యాప్తంగా విడుదల కావాల్సిన సినిమా కావడంతో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా ఇతర మార్కెట్లలోనూ లైన్ క్లియరవ్వాలి. అంటే వైరస్ సమస్య లేకుండా ఉండాలి. ఇక ఆచార్య విషయానికొస్తే తెలుగు రాష్ట్రాలు,  USA మార్కెట్  మళ్లీ తెరిచి థియేటర్లు రన్ అవ్వాలి. ఏపీలో టికెట్ రేట్ల ర‌గ‌డ ఇష్యూ ప్ర‌స్తుతం కోర్టులో ఉంది. ఫిబ్ర‌వ‌రి 10న ఈ పిటిష‌న్ పై విచార‌ణ జ‌ర‌గ‌బోతోంది. అంటే ఆ తర్వాతే టికెట్ రేట్ల వ్యవహారం తేలుతుంది. మరి ఏం జరుగుతుందో..సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న పందెంకోళ్ల ప్రభావం మిగిలిన సినిమాలపై ఏ మేరకు పడుతుందో.. ఇప్పటికే వాయిదా పడిన సినిమాలు వచ్చేదెప్పుడో వెయిట్ అండ్ సీ..

Also Read: దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?

Also Read: టికెట్ ధరల పెంపుపై నాగార్జున స్పందన.. అలా అనేశారేంటీ? నిర్మాతలకు షాకే!

Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..

Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు

 

Published at : 07 Jan 2022 11:27 AM (IST) Tags: RRR Acharya ntr ram charan alia bhatt social media SS Rajamouli Ajay Devgn RRR Movie Acharya Update Acharya Movie Acharya Release Date Acharya Songs RRR Songs Acharya​ NTR RRR Alia Bhatt RRR Acharya Item song acharya teaser acharya trailer acharya songs telugu rrr vs acharya acharya​ saana kastam lyrical acharya new update rrr teaser rrr film rrr promo ss rajamouli rrr ram charan rrr ajay devgn rrr rrr ram charan tollywood latest movie telugu entertainment

సంబంధిత కథనాలు

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్?

Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్?

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!

RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RCB Vs GT Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ - బెంగళూరుకు భారీ గెలుపు అవసరం!

RCB Vs GT Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ - బెంగళూరుకు భారీ గెలుపు అవసరం!

ABV Joining : రెండేళ్ల జీతం ఇవ్వకపోతే కోర్టుకెళ్తానన్న ఏబీవీ - జీఏడీలో రిపోర్ట్

ABV Joining : రెండేళ్ల జీతం ఇవ్వకపోతే కోర్టుకెళ్తానన్న ఏబీవీ - జీఏడీలో రిపోర్ట్

Telangana CM KCR చిల్లర బుద్దిని చూడలేకే ఆ నిధులపై కేంద్రం రూట్ మార్చింది: బండి సంజయ్

Telangana CM KCR చిల్లర బుద్దిని చూడలేకే ఆ నిధులపై కేంద్రం రూట్ మార్చింది: బండి సంజయ్

Nellore Pistol: నెల్లూరులో రెండు ప్రాణాలు తీసిన పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టిన పోలీసులు, కీలక విషయాలు

Nellore Pistol: నెల్లూరులో రెండు ప్రాణాలు తీసిన పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టిన పోలీసులు, కీలక విషయాలు